Vindam Nerchukundam 2nd -6th December
programme details
'విందాం - నేర్చుకుందాం' లైవ్
స్ట్రీమింగ్ కొరకు క్రింది link ను క్లిక్ చేయండి.
విందాం నేర్చుకుందాం తేది.06.12.2019
నేటి రేడియో పాఠం: బాలలసంఘాలు బాధ్యతలు
సమయం : 11 AM
నేటి రేడియో పాఠం : "ఆహారపు అలవాట్లు"(౩వ తరగతి).. (05.12.19)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యాలు, పాట...⤵నేటి రేడియో పాఠం : "సమాన భాగాలుగా విభాగిద్దాం".. (04.12.19)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, ప్రసారానికి ముందు చేయవలసినవి, ఆట, పాట...
★ నేటి రేడియో పాఠం
★ తేదీ : 3-12-2019
★ విషయం : పరిసరాల విజ్ఞానం
★ తరగతి : 5
★ పాఠం పేరు : "ఇళ్ల
నిర్మాణం, పారిశుద్ధ్యం"
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
బోధనా
లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, కృత్యం,
ఆట, పాట...
"విందాం -
నేర్చుకుందాం"..
★ నేటి రేడియో
పాఠం
★ తేదీ : 2-12-2019
★ విషయం : తెలుగు
★ తరగతి : 5
★ పాఠం పేరు : రామన్న కథలు
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసన సామాగ్రి,
ప్రసార పూర్వ కృత్యాలు, పాట..
Click here for 2nd December programme details
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
* రామన్న అనే బాలుడు చదువుకోలేక పోవడానికి గల కారణాలను
ఊహిస్తారు
* మురికివాడల్లో నివసించేవారి జీవన విధానం ఎలా ఉంటుందో
అవగాహన చేసుకుంటారు.
* పట్టణాలలో మురికి వాడలు ఎందుకుంటాయో అవగాహన చేసుకుంటారు
* పెద్ద కుటుంబం, చిన్నకుటుంబం మధ్య జీవన
విధానంలో తేడాలను, కారణాలను అవగాహన చేసుకుంటారు.
* వాతావరణ కాలుష్యపు కోరలనుండి కాపాడుకోవడానికి మనమంతా
చెట్లు విరివిగా పెంచాలని అవగాహన చేసుకుంటారు.
* ఆట, పాటల ద్వారా శారీరక, మానసికోల్లాసాలను
పెంపొందించు కుంటారు.
* సమాచార సేకరణ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు.
✡ బోధనాభ్యసన సామాగ్రి :
1.పాఠ్యపుస్తకం 2.
పల్లెటూరి చిత్రం గీసిన చార్టు 3.
మురికి వాడ చిత్రం గీసిన చార్టు 4. పెద్ద
కుటుంబం,
చిన్న కుటుంబాల చిత్రాలు
5. డస్టరు 6. సుద్దముక్కలు.
✡ కృత్యాలు
ప్రసార పూర్వ కృత్యాలు:
కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను గూర్చి తెలుసు కొని
ఉండాలి.
ఆట
* డస్టరు ఆట' ఆడించడానికి వీలుగా తరగతిలోని
పిల్లలందరినీ ఎ, బి అని రెండు జట్లుగా విభజించాలి.
* ఈ రెండు జట్లు తరగతి గదిలో రెండు చివరస పరుసగా నిలబడాలి
* గది మధ్యలో చిన్న వృత్తం గీసి, దాని
మధ్యలో డస్టరు ఉంచాలి:
* రేడియోలో సంగీతం మొదలవగానే ఒక్కొక్క జట్టు నుండి
ఒక్కొక్కరు వచ్చి, వృత్తం చుట్టూ తిరుగుతూ, డస్టరును
తీసుకొని వెళ్ళాలి.
* డస్టరు తీసుకువెళ్ళిస గ్రూపు వారిని అభినందించాలి.
కృత్యం 1 :
విన్న సంభాషణల ఆధారంగా రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు
తరగతిలోని విద్యార్థు లచే సమాధానాలు చెప్పించాలి.
కృత్యం : 2 :
పాఠ్యపుస్తకం 105 వ పేజీలోని పదజాలం శీర్షికలోని పట్టికను
నల్లబల్లపై రాసి ఉంచాలి.
కార్యక్రమంలో నిర్వహించే కృత్యాలపై అవగాహన కలిగి యుండాలి.
* ఆటలో భాగంగా రేడియో టీచర్ సూచనలకు అనుగుణంగా ఒక్కొక్క
జట్టు నుండి ఒక్కొక్కరిని పిలిచి క్రింది పట్టికలోని ఒక గడిని ఒకరిచేత, రెండోగడిని
మరొకరి చేత పూరింపజేయాలి.
వివరాలు -- రామన్న గురించి -- మీ గురించి____
1. ఇంట్లో ఉన్న
----- -----
2. ఇంటిలోని సభ్యులు
----- -----
3. ఇంటి ముందు వాతావరణం
---- -----
4. నీటి సౌకర్యం
----- -----
5. చదువుకోవడానికి సౌకర్యం -----
-----
6. అమ్మ నాన్నలు
----- -----
* అవసరమైన చోట విద్యార్థినీ విద్యార్థులకు సహాయపడాలి.
✡ పాఠ్యాంశ సంబంధిత పాట:
పాట
కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టు పై రాసి ఉంది.
ప్రసార సమయంలో తరగతి గదిలో ప్రదర్శించాలి.
పల్లవి :
వినరండీ మీరంతా - రామన్న బాధలు
మురికి వాడలో ఆతడు - పడుతున్న కష్టాలు
చీకుచింతలుండనిది - చిన్నకుటుంబం
పెంచుతుంది. కష్టాలను - పెద్ద కుటుంబం
చరణం 1:
బ్రతుకు తెరువు కోసమై - రామన్నకుటుంబం
నగరానికి ప్రక్కనే -మురికివాడ జీవితం
అతడి తండ్రి తెచ్చేటి - కొద్ది పాటి జీతం
జీవించగ చాలదాయె - వారి పెద్ద కుటుంబం
చరణం 2:
పట్టణాలవైపుగా - పల్లె జనం వలసలు
వలసలతో పెరిగిపోవు - మురికి వాడలు
ఉండవచట వారికి - సరియైన వసతులు
కాటేయును వారిని - కాలుష్యపు కోరలు
చరణం 3:
మనసంతా పెంచాలి - మిక్కిలిగా మొక్కలు
కురిపించును మనకు - సకాలంలో వర్షాలు
పండింతురు రైతన్నలు - పుష్కలంగ పంటలు
సిరులు నిండి పల్లెలో - ఇంటింటా వెలుగులు
✡ పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను
వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును
చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
0 Komentar