AP Cabinet approval for cancellation of council
శాసన మండలి రద్దుకు ఏ.పి. మంత్రివర్గం ఆమోదం
శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు.ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కీలక బిల్లులకు అడ్డు తగులుతున్న శాసన మండలి రద్దే సరైందని మంత్రివర్గం భావించింది. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి శాసన సభలో సోమవారం ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు కేబినెట్ భేటీలో భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించినట్టు తెలిసింది.
0 Komentar