Awareness Programs in Schools
అమ్మఒడి వారోత్సవాలు
వారోత్సవాల చివరి రోజు (జనవరి 9) నిర్వహించే కార్యక్రమాల
వివరాలు..
* జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం.
*అర్హులైన తల్లులు/సంరక్షకులని పాఠశాలలకు ఆహ్వానించాలి.
*గ్రామ, మండల, నియోజకవర్గ,
జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను కూడా ప్రారంభోత్సవ సమావేశానికి
ఆహ్వానించాలి.
*ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్ధాయిలో సీఎం వైఎస్ జగన్
ప్రారంభిస్తున్నందున కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలు, తల్లిదండ్రులు
చూసేందుకు వీలుగా T.V.ఏర్పాటు చేయాలి.
*ప్రారంభోత్సవాన్ని పండుగను తలపించేలా వేడుకలాగా
నిర్వహించాలి.
తేదీ.
08-01-2020 నాటి అంశం మనబడి నాడు - నేడు పై అవగాహన
* మనబడి నాడు - నేడు – అవగాహన: ప్రభుత్వ పాఠశాలల్లో 'మనబడి-
నాడు -నేడు' కార్యక్రమం అమలు గురించి తల్లిదండ్రుల కమిటీలకు
మరియు తల్లిదండ్రులకు అవగాహనా కార్యక్రమం.
* పాఠశాలల్లో విద్యార్థుల కోసం
ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా తీసుకుంటున్న చర్యల
గురించి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి.
* అంతేగాక మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ
భాద్యత గురించి కూడా వారికి వివరించాలి.
> తేదీ. 07-01-2020 నాటి అంశం ఆంగ్ల మాధ్యమం - ఆవశ్యకత.> ఈ రోజు పాఠశాలలో ఆంగ్లమాధ్యమం ప్రవేశానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించడం మరియు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం గురించి తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో చర్చించడం.
> ఈ సమావేశంలో పేరెంట్స్ కమిటీ మరియు తల్లిదండ్రులకు ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత గురించి వివరిస్తూ వారి యొక్క అభిప్రాయాలను సేకరించాలి.
> సేకరించిన అభిప్రాయాలను మండల విద్యాశాఖ అధికారులకు అందజేయాలి.
> మండల విద్యాశాఖ అధికారులు ఉప విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
నేటి కార్యక్రమ వివరాలు (తేది : 06.01.2020)
☆ మధ్యాహ్నభోజన పథకం
☆ మధ్యాహ్నభోజన పథకం నాణ్యత
పెంపు
☆ఆహార పట్టీకలో సంక్రాంతి
తర్వాత మార్పుల గురించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు,తల్లిదండ్రులకు
అవగాహన కార్యక్రమం
☆ ఈరోజు
తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు మరియు తల్లిదండ్రులకు మధ్యాహ్నం భోజన పథకం నాణ్యత పెంపు మరియు
పట్టికలో సంక్రాంతి తర్వాత మార్పుల గురించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు అవగాహన
కార్యక్రమం నిర్వహించాలి. ఈ
కార్యక్రమంలో తల్లిదండ్రులు అందరికీ సామూహిక భోజనాలు ఏర్పాటు చేయాలి.
☆ పిల్లలకు
మధ్యాహ్న భోజన పథకంలో చేపట్టిన మార్పులను వారికి వివరించి మధ్యాహ్న భోజనం
పాఠశాలలోని చేసేటట్లు ప్రోత్సహించాలి.
☆ తల్లిదండ్రులు
భోజనం నాణ్యతను పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇవ్వాలి.
☆ నూతన
ఆహార పట్టికను మరియు అదనపు పౌష్టికాహారాన్ని సంక్రాంతి తర్వాత పాఠశాలలో అమలు చేయటం
జరుగుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం
సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు
చేయనున్నది.
☆ ఈ రోజు
కార్యక్రమమునకు మధ్యాహ్న భోజన పథకం వివరాలను
కరపత్రం రూపంలో తల్లిదండ్రులకు ఇవ్వవలెను. ఈ కార్యక్రమమునకు ప్రజాప్రతినిధులను
గ్రామ పెద్దలు ఆహ్వానించాలి.
☆ ప్రతిరోజు
కార్యక్రమాలను మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉప విద్యాశాఖ అధికారులు మరియు సమగ్ర
శిక్ష సెక్టోరియల్ అధికారులు పాఠశాలను సందర్శించి
కార్యక్రమంలో పాల్గొంటారు.
నేటి కార్యక్రమ వివరాలు (తేది : 04.01.2020)
★ జగనన్న
అమ్మఒడి పథకంపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకు&
సంరక్షకులకు అవగాహన కార్యక్రమం.
★ అమ్మఒడి
పథకంలో గుర్తించిన అర్హులైన తల్లులు/ సంరక్షకుల జాబితా ప్రదర్శించాలి.
★ అమ్మఒడి
పథకం కింద ఇంకా గుర్తింపు పొందాల్సిన•••అర్హులైన తల్లులు/
సంరక్షకులు ఉంటే వారి వివరాలు తగిన ధ్రువపత్రాలతో సేకరించి సంబంధిత మండల
విద్యాశాఖాధికారికి అందజేయాలి.
అమ్మఒడి వారోత్సవాలు మోడల్ ఫ్లెక్స్
అమ్మ ఒడి ని విద్యా సంస్థల్లో అమలుపరుచుట పై CSE వారి సూచనలు..రోజూ వారి షెడ్యూల్..
Rc.242,Dt.2/1/2020
జనవరి 4 నుంచి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు-వివరాలు
జనవరి 4 నుంచి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు-వివరాలు
ఈనెల 4 నుంచి 9 వరకు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను
నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో
విద్యా కమిటీ సభ్యులు ఇతర మహిళలు విద్యార్థుల తల్లులతో సమావేశాలను నిర్వహించాలని
కోరారు.
*4న అమ్మఒడి కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.
*5న మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతుంది తదితర
విషయాలను తల్లులతో చర్చించాలని పేర్కొన్నారు.
*6న సెలవు
*7న ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న
విషయాన్ని కూడా తెలియజేయాలని సూచించారు.
*8న పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాన్ని
వివరించాలని పేర్కొన్నారు.
*9న పాఠశాలల పరిధిలో తల్లులకు అమ్మఒడి
చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.
ఈమేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
0 Komentar