Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Employers reminded to deduct income tax if PAN and Aadhaar not given

Employers reminded to deduct income tax if PAN and Aadhaar not given
ఉద్యోగులు పాన్‌ లేదా ఆధార్‌ లేకపోతే 20% పన్ను కట్టాల్సి రావచ్చు...
పాన్‌కార్డు గానీ, ఆధార్‌ కార్డుగానీ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత)చేయాలని యాజమాన్యాలకు గత వారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యిలర్‌ జారీ చేసింది.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్‌ కార్డు వివరాలను యాజమాన్యాలకు అందజేయాలి. ఒక వేళ ఇవ్వకపోతే 20శాతం మొత్తం కానీ, చట్టంలో వర్తించే రేటు ప్రకారం గానీ ఏది ఎక్కువ అయితే అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి వద్ద నుంచి కత్తిరించాలి.
సాధారణంగా 20శాతం శ్లాబు కంటే తక్కువలోకి వచ్చే ఉద్యోగులు పాన్‌, లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వకపోతే వారికి జీతంలో 20శాతం వరకు పన్నుకోత విధిస్తారు. అదే 20శాతం శ్లాబు దాటితే ఎంత అయితే అంత కోత విధించడంతోపాటు 4శాతం హెల్త్‌, ఎడ్యూకేషన్‌ సెస్‌ కూడా వసూలు చేస్తారు. అలాగే యాజమాన్యాలు ఈ టీడీఎస్‌ నియమాలను పాటించకపోతే వారికి జరిమానాలు విధిస్తామని వెల్లడించింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags