Guidelines for
Celebrating Sports Day
క్రీడా దినోత్సవం జరుపుకొనుటకు మార్గదర్శకాలు
క్రీడా దినోత్సవాన్ని
పురస్కరించుకుని మండలస్థాయిలో క్రీడాపోటీలు....
*9, 10 తరగతుల
విద్యార్థులను ఈ పోటీల్లో భాగస్వాములను చేయలేదు.
*ఒకటి నుంచి అయిదోతరగతి
విద్యార్థులు జూనియర్ విభాగంలో, 6, 7, 8 తరగతులు చదువుతున్న వారు సీనియర్
విభాగంలో పోటీపడాల్సి ఉంది.
*పాఠశాలలకు పోటీల నిర్వహణకు
సంబంధించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను సమగ్రశిక్షా అధికారులు విడుదల
చేశారు.
*మండల స్థాయిలో నిర్వాహక కమిటీ
ఛైర్మన్లుగా ఆయా మండలాల విద్యాశాఖాధికారులు వ్యవహరిస్తున్నారు.
*సీనియర్ ఫిజికల్ డైరెక్టర్
మండల కమిటీ కన్వీనర్‌గా, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు కమిటీ
సభ్యుడిగా, మండలంలో ముగ్గురు వ్యాయామోపాధ్యాయులు కమిటీ
సభ్యులుగా ఉన్నారు
*మండల స్థాయి కమిటీ ఆధ్వర్యాన
నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలైన వారికి క్రీడాదినోత్సవం సందర్భంగా బహుమతులు
అందజేస్తారు
*క్రీడల నిర్వహణ, బహుమతుల
అందజేత వంటి విషయాలను ఫొటోలతో సహా పొందుపరుస్తూ పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్
తయారుచేసి సమగ్రశిక్షా కార్యాలయానికి పంపించాలి.
*ప్రతి మండలానికి రూ.10వేలతో
పాటు క్రీడాదినోత్సవం రోజున కార్యక్రమ నిర్వహణకు సహాయ గ్రాంటు కూడా
అందించనున్నారు.
0 Komentar