How to modify details in Aadhaar card
ఆధార్‌లో చిరునామా, తండ్రి,
భర్త వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం ఇక
ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా సొంతంగా చేసుకునే వెసులుబాటును భారత ప్రభుత్వం
కల్పించింది. వ్యక్తిగత వివరాలు సవరణ చేసుకోదలచినవారు తమ ఆధార్‌కు ఫోన్ నంబరు
లేదా మెయిల్ ఐడీ అనుసంధానం అయి ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ మార్పులకు కూడా ప్రభుత్వం
సూచించిన ఫొటో గుర్తింపుతో గల చిరునామా ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరి.
అంతర్జాలం ద్వారా మార్పు చేసుకునేవారు ఇలా చేయొ చ్చు.
ఎలా చేసుకోవాలంటే..
https:///uidai.gov.in/ లింక్‌ను
వెబ్ పేజీలో నమోదు చేయడం ద్వారా యూఐడీఏఐ పేజీ తెరుచుకుంటుంది. తొలుత మై ఆధార్‌పై
మౌస్‌ను ఉంచితే మరో మెనూ బార్ తెరుచుకుంటుంది. అందులో అప్‌డేట్ యువర్ ఆధార్‌లో
అప్‌డేట్ చిరునామాపై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపన్ అవుతుంది. అందులో అప్‌డేట్
యువర్ అడ్రస్ వద్ద క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్ అని వస్తుంది.
తర్వాత వచ్చే పేజీలో 12 అంకెల ఆధార్ నంబరును నమోదు చేసి
సూచించిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి. సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే గతంలో
ఆధార్‌తో లింకైన ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి నెక్ట్స్ బటన్‌పై
క్లిక్ చేస్తే మరో పేజీలో అప్‌డేట్ అడ్రస్ వయా అడ్రస్ ప్రూఫ్ ఆప్షన్
వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గతంలో ఆధార్ కార్డులో ఉన్న చిరునామా వివరాలు
ఉంటాయి. దాని కింద మార్చాల్సిన చిరునామా వివరాలు నమోదు చేసి ప్రీవ్యూపై క్లిక్
చేయాలి. మనం నమోదు చేసిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని ఈ పేజీలో చూసుకోవచ్ఛు
వివరాలన్నీ సక్రమంగా ఉంటే కింద ఇచ్చిన బాక్స్‌పై క్లిక్ చేస్తే టిక్ మార్కు
వస్తుంది. అనంతరం సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి. అప్‌లోడ్ ఎ కాపీ ఆఫ్ వ్యాలిడ్
అడ్రస్ ప్రూఫ్ అని అడుగుతుంది. అందులో మనం ఏరకమైన ప్రూఫ్ అప్‌లోడ్
చేస్తున్నామో దానిని ఎంచుకుని అప్‌లోడ్ డాక్యుమెంట్‌పై క్లిక్ చేయాలి. అందులో
స్కాన్ చేసిన ప్రూఫ్‌ను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేస్తే, రిసిప్ట్
వస్తుంది. నమోదు చేసినట్లు ఫోన్‌కు సందేశం వస్తుంది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే
సూచించిన గడువులోగా కొత్త కార్డు పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది. యూఐడీఏఐ వెబ్‌సైట్
ద్వారా కూడా ఆధార్ పొందవచ్ఛు చిరునామా ప్రూఫ్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 45 రకాల అంశాలను నిర్దేశించింది. వీటిల్లో ఏదైనా ఒకటి సబ్‌మిట్ చేయాలి. ఇలా
ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చిరునామాలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
0 Komentar