JEE Main in Telugu
ఇక తెలుగులోనూ జేఈఈ మెయిన్
కేంద్ర మానవ వనరుల
అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆదేశాల మేరకు జేఈఈ మెయిన్ పరీక్షలను 9 ప్రాంతీయ
భాషల్లోనూ నిర్వహిం చేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కసరత్తు
ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో
చదువుకున్న వారు ఇంగ్లిష్/హిందీ లేదా గుజరాతీలో ఇచ్చే జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల
కారణంగా విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నట్లు ఎంహెచ్‌ఆర్‌డీ గుర్తించినది. 2021
జనవరి నుంచి జేఈఈ మెయిన్‌ను ఇంగ్లిష్, హిందీ సహా 11 భాషల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఎన్‌టీఏను ఎంహెచ్‌ఆర్‌డీ
ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎన్‌టీఏ కసరత్తు ప్రారంభించింది. దాదాపు లక్షన్నర
మందికి పైగా తెలుగు విద్యార్థులు రాసే ఈ పరీక్షలను తెలుగులోనూ నిర్వహించేలా చర్యలు
చేపడుతోంది.
వచ్చే ఏప్రిల్‌లో మాత్రం
మూడు భాషల్లోనే..
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ,
ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా
సంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌నూ
ఇంగ్లిష్, హిందీతోపాటు గుజరాతీలో మూడు భాషల్లోనే
నిర్వహిస్తోంది. వచ్చే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ను కూడా మూడు భాషల్లోనే
నిర్వహిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
11 భాషల్లో నిర్వహించేలా..
2021 జనవరిలో నిర్వహించే
జేఈఈ మెయిన్ పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ
భాషలైన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ,
కన్నడ, మరాఠీ, ఒడియా,
తమిళ్, తెలుగు, ఉర్దూ
భాషల్లో నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. 2021 జనవరి తరువాత
కూడా ఇకపై ప్రతి ఏటా 11 భాషల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది.
0 Komentar