LOCKED HOUSE MONITORING SYSTEM
నట్టింట్లో పోలీస్: చోరీల నియంత్రణ సులభతరంలాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్)ను పోలీసులు ప్రవేశపెట్టారు. ఇదో మొబైల్ యాప్... నట్టింట్లో నడియాడే పోలీస్‌గా దీన్ని చెప్పుకోవచ్చు.
ఎలా పని చేస్తుందంటే...
ప్లేస్టోర్ నుంచి మీరు ముందుగా
ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ పేరు, చిరునామా,
మొబైల్ నంబరు యాప్‌లో నమోదు చేసుకుంటే... మీకు పోలీసులు ఓ యూనిక్
నంబరును కేటాయిస్తారు. మీరు ఊరికి వెళుతున్నట్లయితే... ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌లో
వినతి పెట్టాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఊర్లో ఉండరో వివరించాలి. అప్పుడు... మీ
ప్రయాణానికి ముందు స్థానిక పోలీసులు వైర్‌లెస్ మోషన్ కెమెరా, మోడెమ్‌ను మీ ఇంట్లో ఏర్పాటు చేస్తారు.. ఇవి రెండూ జిల్లా పోలీసు
కార్యాలయంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కూ, స్థానిక
పోలీసు స్టేషన్‌కు అనుసంధానించి ఉంటాయి. ఈ పరికరం బిగించిన ఇంట్లోకి ఎవరైనా
దుండగులు ప్రవేశిస్తే ఈ మోషన్ కెమెరా వారిని పసిగడుతుంది. వెంటనే
మోడెమ్ ద్వారా పోలీసు కంట్రోల్‌రూమ్‌తో పాటు స్థానిక పోలీసులనూ అప్రమత్తం
చేస్తుంది. దీన్ని మీ మొబైల్‌తోనూ అనుసంధానం చేసే అవకాశం
ఉంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై చోరీ జరుగుతుండగానే నిందితుల్ని పట్టుకునే
అవకాశం ఉంది. ఒకవేళ నిందితులు అప్పటికే ఉడాయించినా... సీసీ కెమెరాలో నిక్షిప్తమైన
పుటేజ ఆధారంగా పట్టుకునే వీలుంది.
ఒకవేళ నిందితులు అప్పటికే
ఉడాయించినా... సీసీ కెమెరాలో నిక్షిప్తమైన పుటేజీ ఆధారంగా పట్టుకునే వీలుంది.Download LOCKED HOUSE MONITORING SYSTEM APP
0 Komentar