జాతీయ విద్యావిధానం-2020 నివేదికలోని కొన్ని
అంశాలు
పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన
వర్గాలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని, పాఠశాల
విద్యలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ విద్యావిధానం-2020 నివేదిక సూచించింది. పాఠశాల, ఉన్నతవిద్య ప్రస్తుత
పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను 60 పేజీల నివేదిక పేర్కొంది. పూర్వప్రాథమిక విద్యలో నాణ్యత ఉండటం లేదని,
అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. చాలామంది
విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం రావడం లేదని,
చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని
హెచ్చరించింది.
5+3+3+4 విధానం
పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం అమలు
చేయాలి. ఐదేళ్లలో మొదటి మూడేళ్లు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు 1, 2 తరగతులు, తర్వాత మూడేళ్లలో 3-5 తరగతులు, అనంతరం మూడేళ్లు 6-8
తరగతులు, నాలుగేళ్లలో ఉన్నత పాఠశాల 9-12 తరగతులు ఉంటాయి. మొదటి ఐదేళ్ల పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి
ప్రవర్తన, నైతికత, వ్యక్తిగత పరిశుభ్రత,
బృందంగా, పరస్పర సహకార విధానం బోధించాలి.
2035 నాటికి 100% ప్రవేశాలు
ప్రస్తుతం విద్యార్థుల ప్రవేశాల నిష్పత్తి 6-8 తరగతుల్లో 90.7%, 9-10లో 79.3%, 11-12 తరగతుల్లో 51.3%. ఈ గణాంకాల ప్రకారం ఎనిమిదో తరగతి
తర్వాత బడి మానేస్తున్న వారి సంఖ్య అధికం. వీరిని మళ్లీ బడికి తీసుకొచ్చే
కార్యక్రమంపై దృష్టి పెట్టాలి.
పూర్వప్రాథమిక విద్యలో 2035 నాటికి 100% స్థూల ప్రవేశాల నిష్పత్తి ఉండాలి.
నివేదికలోని మరికొన్ని అంశాలు
*ఉన్నత విద్యాసంస్థలు నాలుగేళ్ల డిగ్రీలను ఆహ్వానించాలని
సూచించింది.
*విద్యార్థులు ఎప్పుడైనా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలి.
*మొదటి ఏడాది వెళ్లిపోతే డిప్లొమా అర్హత ధ్రువపత్రం, మూడేళ్లకు
బయటకు వెళ్తే డిగ్రీ ఇవ్వాలని వెల్లడించింది.
* జాతీయ ఉపకార వేతనాన్ని మరింత విస్తరించాలి. ప్రైవేటు
ఉన్నత విద్యాసంస్థలు ఉపకార వేతనాలను అందించాలి.
* 2040 నాటికి డిగ్రీ కళాశాలలు
స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలుగా, విశ్వవిద్యాలయాలు...
పరిశోధన వర్సిటీలు, బోధన వర్సిటీలుగా మారాలి.
* 2030 నాటికి నాలుగేళ్ల సమీకృత డిగ్రీ+ బీఈడీ కోర్సు
అర్హతగా ఉండాలి. విద్యా సంస్థలు బహుళ బీఈడీ కోర్సులను నిర్వహించాలి. నాణ్యతలేని
ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసివేయాలి.
* జాతీయ ఓపెన్ స్కూల్(ఎన్‌ఐవోఎస్)లో సార్వత్రిక, దూరవిద్య
కోర్సులను మరింత పెంచాలి.
Click here for National Educational policy-2020
Click here for National Educational policy-2020
0 Komentar