జాతీయ యువజన దినోత్సవం
భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ
దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు
ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామీ వివేకానంద జవవరి 12,
1863 న జన్మించాడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన స్వామీ వివేకానంద
వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము
కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా
అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత
శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము
చేసిన ఖ్యాతి అతనికి ఉంది.
గురువు గారి కోరిక మేరకు అమెరికాకు
వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని
వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి
శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే.
తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్
రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను,
అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా
నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత
ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది.
0 Komentar