Navodaya Class IX entrance Exam Admit cards
జవహర్ నవోదయ తొమ్మిదో తరగతి ప్రవేశ
పరీక్ష హాల్ టికెట్లు
జవహర్ నవోదయ విద్యాలయం సెలక్షన్
టెస్ట్ (JNVST
2020) హాల్‌టికెట్ల(అడ్మిట్ కార్డ్)ను నవోదయ విద్యాలయ సమితి జనవరి
17న విడుదల చేసింది. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 9వ తరగతిలో
ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్
వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్ష
నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్
చేసుకోండి..
➦ హాల్‌టికెట్ల
కోసం అభ్యర్థలు మొదట navodaya.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్
కావాలి.
అక్కడ హోంపేజీలో కనిపించే “Admit card for
selection test for admission in class IX” లింక్‌పై క్లిక్ చేయాలి.
➦ క్లిక్
చేయగానే.. హాల్‌టికెట్‌కు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
➦ అక్కడ
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేయాలి.
➦ వివరాలు
నమోదుచేయగానే 9వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్ష హాల్‌టికెట్ కంప్యూర్
స్క్రీన్‌పై కనిపిస్తుంది.
➦ హాల్‌టికెట్
డౌన్‌లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి. పరీక్షలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా
హాల్‌టికెట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే పరీక్షకు
ప్రవేశం ఉండదు.
➦ విద్యార్థులకు
ఏమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌డెస్క్ నెంబర్ - 0120-2975754 ద్వారా
సంప్రదించవచ్చు.
పరీక్ష విధానం..
➦ మొత్తం
80 ప్రశ్నలకు గానూ.. 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఇంగ్లిష్-15
మార్కులు, హిందీ-15 మార్కులు, మ్యాథ్స్-35
మార్కులు, సైన్స్-35 మార్కులు ఉంటాయి.
➦ ఆబ్జెక్టివ్/
డిస్క్రిప్టివ్ విధానంలో సాగే పరీక్ష 3 గంటలపాటు ఉంటుంది.
Hall tickets download link
0 Komentar