Navodaya Class VI entrance Exam Admit cards
జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు
జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు
*ఆరోతరగతి ప్రవేశానికి ఈనెల 11న పరీక్ష
*ఈఏడాది నుంచి ఓఎంఆర్ విధానం
*100 నుంచి 80 ప్రశ్నలకు కుదింపు
# మూడు విభాగాల్లో పరీక్ష
*ప్రవేశ పరీక్ష విరామం లేకుండా రెండుగంటలు కొనసాగుతుంది. వంద మార్కులకు 80 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు విభాగాలలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది. రీజనింగ్ మేథాశక్తిలో 50మార్కులకు 40ప్రశ్నలు, గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు, తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఐదు పాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో పాఠ్యాంశానికి నాలుగు ప్రశ్నలు చొప్పన ఉంటాయి. వీటికి 25 మార్కులు ఉంటాయి.
# మేధాశక్తికి అధిక మార్కులు
*మేధాశక్తి విభాగంలో 50 మార్కులు ఉంటాయి. బొమ్మలతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న కింద నాలుగు సమాధానాలు బొమ్మల రూపంలో ఉంటాయి. ఈప్రక్రియలో సులభంగా మార్కులు పొందడానికి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సమయస్పూర్తితో ఆలోచించాల్సి ఉంటుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఇందులో సులువుగా 45 మార్కులు వరకు పొందే అవకాశం ఉంది.
#గణితమే కీలకం
*గణిత విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు వంతున 20 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. గణితంలో ఐదోతరగతి వరకు గల అన్ని చాప్టర్లలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు. గతంలో అధిక మార్కులు సంపాదించ గలిగే విద్యార్ధులు దాదాపుగా నవోదయలో సీటు పొందే అవకాశం ఉంది.
# పఠనాసక్తి అంచనా..
*భాష పఠనాశక్తిని అంచనా వేసేందుకు భాషా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి. ఈ విభాగంలో ఐదు పాఠ్యాంశాలు ఇస్తారు. ఒక్కో పాఠ్యాంశంలో నాలుగు ప్రశ్నలు వంతున ఐదు పాఠ్యాంశాలలో 25 మార్కులు ఉంటాయి. పాఠ్యాంశాలు ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు అన్ని ఒకేలా ఉంటాయి. నిశితంగా గమనిస్తే సమాధానం కచ్చితంగా గుర్తించవచ్చు.
# అభ్యర్థులకు సూచనలివీ..
*పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్ టిక్కెట్, ప్యాడ్, నీలం ,నలుపు రంగు పెన్నులు తీసుకువెళ్లాలి ఫ ప్రశ్నపత్రంలో అన్ని పేజీలు ప్రింట్, క్రమసంఖ్య మీడియం సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫ పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందుగా వెళ్లాలి ఫ ఓఎంఆర్ షీట్‌లో విద్యార్థి వివరాలు ఉంటాయి. వాటిని సరిచూసుకోవాలి
User Name: JNV Registration No.PASSWORD: DATE OF BIRTH
Click Here To Download ADMIT CARDS
0 Komentar