Registration is mandatory if the vehicle
exceeds 15 years
వాహనానికి 15
ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కండిషన్‌లో ఉంటే మరో ఐదేళ్లు
అనుమతి
రవాణా శాఖ నిబంధనల ప్రకారం కారు, ద్విచక్ర
వాహనం ఏదైనా 15 ఏళ్ల వరకే రోడ్డు మీద తిరిగేందుకు అనుమతి
ఇస్తారు. ఆ తరువాత ఆ వాహనాలు రోడ్ల మీద తిరగాలంటే దాని సామర్థ్యం పరీక్షించి అన్నీ
సక్రమంగా ఉంటే రవాణా శాఖ అనుమతులు ఇస్తుంది. వాహనం సామర్థ్యం ప్రకారం లేకపోతే దానిని
పక్కన పెట్టేస్తారు. ఇక పాఠశాలల బస్సులైతే ఏటా ఫిట్‌నెస్ సర్టిఫికెట్
తీసుకోవాల్సిందే. అన్నీ సక్రమంగా ఉంటే కేవలం ఒకట్రెండు రోజుల్లో మళ్లీ కొత్త
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది.
ఏం చేయాలంటే..
15 సంవత్సరాలు నిండిన
వాహనానికి ఫిట్‌నెస్ ధ్రువపత్రం పొందాలంటే ముందుగా వాహనానికి సంబంధించిన ఒరిజినల్
ధ్రువపత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. రవాణా శాఖ అనుమతి పొందిన సేవా
కేంద్రాల్లో ఈ సేవలు పొందవచ్చు. ముందుగా వాహనానికి సంబంధించిన ఒరిజినల్ బీమా
పత్రం, కాలుష్య పత్రం, వాహన యజమాని
ఆధార్ కార్డు, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు
తీసుకువెళితే సదరు సేవా కేంద్రంలో వాటిని అప్‌లోడ్ చేస్తారు. ఆ తరువాత వాహనానికి
సంబంధించిన రీ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఫీజు చెల్లించాలి. గ్రీన్ ట్యాక్స్
చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులన్నీ చెల్లించిన తరువాత మీకు స్లాట్ టైం ఇస్తారు.
ఏ రోజు ఏ సమయానికి ఏ రవాణా శాఖ కార్యాలయం వద్దకు వాహనాన్ని తీసుకువెళ్లాలో
సదరు స్లాట్‌లో తెలియజేస్తారు. స్టాట్ బుకింగ్ చేసిన పత్రంతో పాటు వెబ్‌సైట్‌లోకి
అప్‌లోడ్ చేసిన పత్రాలు తీసుకుని మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయానికి
వెళ్లాలి. అక్కడ వాహనాన్ని మోటారు వాహనాల తనిఖీ అధికారి వాహనాన్ని ప్రత్యక్షంగా
పరీక్షిస్తారు. స్టీరింగ్, బ్రేక్ పనితీరు చూస్తారు. హెడ్
లైట్లు, సిగ్నల్ లైట్లుతో పాటు ఇతర భాగాలు సక్రమంగా ఉంటే
సదరు వాహనానికి ఫిట్‌నెస్ పత్రం ఇస్తారు. ఆ తరువాత మరో ఐదేళ్ల వరకు దాని రిజిస్ట్రేషన్
పొడిగిస్తూ కొత్త ఆర్‌సీ ఇస్తారు. మళ్లీ ఐదేళ్లు గడిచిన తరువాత ఇదే పద్ధతిలో
వాహనాఇన పరీక్షించుకుని రీరిజిస్ట్రేషన్ చేయించవచ్చు. ఎక్కడ ఏ చినన లోపం ఉన్నా
వాహనానికి రీరిజిస్ట్రేషన్ చేయరు. లోపాన్ని సరిచేసుకున్న తరువాత పరీక్షించి కొత్త
ఆర్‌సీ పత్రం ఇస్తారు.
0 Komentar