Sakshi Disha Women's Rights e-book
మహిళల హక్కులపై దిశానిర్దేశం
ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటనతో
దేశమంతా అట్టుడికింది. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టే
ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అయినా, మహిళలు నిర్భయంగా సంచరించే పరిస్థితులు నెలకొనలేదు. దేశంలో సాగుతున్న
కీచకపర్వాన్ని జాతీయ నేర గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో
గత ఏడాది ఆఖరులో జరిగిన దిశ సంఘటనతో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
వ్యక్తమయ్యాయి. ఈ సంఘటన దరిమిలా తొలుతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది.
కీచకపర్వానికి తెరదించాలనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తెచ్చింది. దిశ చట్టాన్ని
కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నడుం బిగించింది. దీనికోసం పోలీసు, న్యాయ వ్యవస్థల బలోపేతానికి ఏర్పాట్లను ప్రారంభించింది. దిశ చట్టం
దేశానికే దిశానిర్దేశం చేసేదిగా ఉందంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించడమే కాదు, ఇదే
చట్టాన్ని దేశవ్యాప్తంగానూ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేయడం విశేషం. మహిళలకు
దిశానిర్దేశం కోసమే ఈ ప్రత్యేక సంచిక.
Courtesy by Sakshi new paper
0 Komentar