School Assembly 27th
January Information
నేటి
ప్రాముఖ్యత
*మొట్టమొదటి సారి టెలివిజన్ ను లండన్
1926సం. లో ప్రదర్శించారు.
*భారత్ లో హెలికాప్టర్ ద్వారా
ఉత్తరాల రవాణాను 1988సం. లో ప్రారంభించారు.
చరిత్రలో
ఈరోజు
*ప్రముఖ
కవి, రచయిత, న్యాయవాది ‘పోతుకూచి సాంబశివరావు’, 1928 సం.లో జన్మించారు.
*సుప్రసిద్ధ
కథా, నవలా రచయిత్రి “కోడూరి కౌసల్యాదేవి”, 1936 సం.లో జన్మించారు.
*భారత
మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన
రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య
సమరయోధుడు “ఆర్.వెంకట్రామన్”, 2009 సం. లో మరణించారు.
*చందమామ
కథా రచయిత మరియు చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు “దాసరి సుబ్రహ్మణ్యం”, 2010 సం. లో మరణించారు.
మంచి
మాట:
మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన
ఆభరణం- స్వామి వివేకానంద
నేటి
అంశము:
పోషకాహార అవసరం
పరీక్ష వేళల్లో అన్నిటికంటే
ముఖ్యమైంది ఆహారం. ఆ సమయంలో మెదడు చురుగ్గా పనిచేయాలంటే సులువుగా జీర్ణం అయ్యే
ఆహారమే తీసుకోవాలి. బాగా మసాలాలు దట్టించినవి అసలు తీసుకోకండి. దాని వల్ల శరీరం
నిదానం అయిపోతుంది, బద్దకంపెరుగుతుంది. అందుకే సరైన ఆహారం,
సరైన నిద్ర, సరైన విశ్రాంతి తీసుకుంటూ
చదువుకోండి. పరీక్షల్లో విజయం సాధించండి.
వార్తలలోని
ముఖ్యాంశాలు
*భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ
వేడుకలు రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి
చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక
పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే
విన్యాసాలతో పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి
విషయంలో ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. ఐతే శాసన మండలి రద్దుకే రాష్ట్ర
సర్కారు మొగ్గు చూపుతున్న తెలుస్తున్నది.
*అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని
వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఏ.పి. రాష్ట్ర
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల్లో నైతికత, మానవ
విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టులలో విద్యార్థులు
తప్పనిసరిగా ఉత్తీర్ణణ సాధించాల్సి ఉంది.
*ఏ.పి. లో కృష్ణా, గుంటూరు
జిల్లాల్లో మరియు అమరావతి ప్రాంతంలో, తెలంగాణలోని నల్గొండ,
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం
తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి.
*గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో
వెల్లివిరియాలనే లక్ష్యంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా
నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.
*తెలంగాణరాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం కొత్త
పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి.
*21వ శతాబ్దం సైన్స్ & టెక్నాలజీ, ప్రజాస్వామ్యాలదేనని
ఏ సమస్య పరిష్కారం అయినా శాంతియుత పద్ధతుల్లోనే జరగాలని ‘మన్‌కీ
బాత్’లో ప్రధాని మోదీ అన్నారు.
*చైనాలో కరోనా వైరస్ ధాటికి
ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికి కరోనా వైరస్ సోకి 56 మంది ప్రాణాలు
కోల్పోగా 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా సర్కార్ ప్రకటించింది.
*పూర్తి ఏకపక్షంగా సాగిన రెండో
టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132
పరుగులు చేసింది.*ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ లో పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సోఫియా కెనిన్ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) కష్టపడి ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటారు.
School Assembly 27th January Information
0 Komentar