Services in the ATM
ATM లను మనం ఎక్కువగా నగదు ఉపసంహరణకే ఉపయోగిస్తూ ఉంటాము. ఐతే
నగదు ఉపసంహరణకే కాకుండా ATM ల ద్వారా మనం అనేక సేవలు
పొందవచ్చు. వాటిని ఒకసారి చూద్దాం..
మొబైల్ రీచార్జ్
మొబైల్ ఫోన్ రీచార్జ్ కోసం ఏటీఎంను వినియోగించుకోవచ్చు.
మొబైల్ ఫోన్ నెంబర్ ను ఎంటర్‌చేసి ఆపరేటర్‌ను ఎంచుకున్న తర్వాత ఎంత మొత్తమైతే
రీచార్జ్ అవసరం ఉంటుందో ఆ వివరాలను తెలియజేస్తే రీచార్జ్ అయిపోతుంది. మీ సొంత
నెంబర్‌నే కాకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరుల నెంబర్లకు కూడా రీచార్జ్ చేయవచ్చు.
బిల్లుల చెల్లింపులు
ఏటీఎం ద్వారా వివిధ రకాల బిల్లులు కూడా చెల్లించవచ్చు.
టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, గ్యాస్
బిల్లు, ఇతర వినియోగ బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. అయితే
బిల్లుల చెల్లింపులకు ముందు బ్యాంకు వెబ్‌సైట్‌లో ముందుగా బిల్లు వసూలు చేసే సంస్థ
పేరును రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. దీనికి అనుమతి వచ్చిన తర్వాత ఎప్పుడంటే
అప్పుడు చెల్లింపులు చేయవచ్చు.
నగదు బదిలీ
ఏటీఎం ద్వారా నగదును బదిలీ చేయవచ్చు. ఆన్‌లైన్ లేదా
బ్యాంకు శాఖ ద్వారా ముందు ఎవరికైతే నగదు బదిలీ చేయాలనుకుంటున్నామో వారి ఖాతాను
రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. ఒక రోజులో
రూ.40 వేల వరకు నగదు బదిలీ చేయవచ్చు. లావాదేవీల సంఖ్యపై మాత్రం పరిమితి ఉండదు.
ఫిక్స్‌డ్ డిపాజిట్
ఏటీఎం ద్వారా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)
ఖాతాను కూడా తెరవచ్చు. ఏటీఎం స్ర్కీన్‌పై కనిపించే ఓపెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్
అనే ఆప్షన్‌ను ఎంచుకుని ఎంత సొమ్ము ఎంత కాలానికి డిపాజిట్ చేయాలో తెలియజేస్తే ఆ
మేరకు ఖాతాలోని సొమ్ము ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాకు బదిలీ అవుతుంది.
బీమా ప్రీమియం
బీమా కంపెనీల ప్రీమియంను కూడా ఏటీఎం ద్వారా చెల్లించవచ్చు.
ఎల్‌ఐసీ,
హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ తదితర
సంస్థలు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రీమి యం చెల్లించడానికి గాను
పాలసీ నెంబర్, పుట్టిన తేదీ లేదా మొబైల్ నెంబర్, ప్రీమియం అమౌంట్ వంటి వివరాల అవసరం ఉంటుంది.
వ్యక్తిగత రుణం
వ్యక్తిగత రుణం కోసం కూడా ఏటీఎంను వినియోగించుకోవచ్చు.
ఏటీఎంల ద్వారా కొన్ని ప్రైవేటు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ రుణ సదుపాయాన్ని
కల్పిస్తున్నాయి. వ్యక్తిగత రుణ దరఖాస్తు సదుపాయం ఏటీఎంలోనే ఉండటం వల్ల బ్యాంకు
శాఖకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.
పన్ను చెల్లింపులు
పలు రకాల పన్ను చెల్లింపులను కూడా సులభంగా ఏటీఎం ద్వారా
చెల్లించవచ్చు. ఆదాయ పన్ను, అడ్వాన్స్ టాక్స్, సెల్ఫ్
అసె్‌సమెంట్ టాక్స్, పన్ను బకాయిలను చెల్లించవచ్చు. ఇందుకు
కోసం బ్యాంకు శాఖ లేదా బ్యాంకు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
చెక్ బుక్
చెక్ బుక్ అవసరమైనప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి దరఖాస్తు
చేయాల్సి ఉంటుంది. అయితే ఏటీఎం ద్వారా కూడా చెక్ బుక్ కోసం అప్లయ్ చేయవచ్చు.
ఇందుకోసం ఏటీఎంలో ‘రిక్వెస్ట్ చెక్ బుక్’ అన్న ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.
0 Komentar