Yoga Break in Government offices
ప్రభుత్వ సంస్థల్లో యోగా బ్రేక్
వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడిని
తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై-బ్రేక్) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్
సంస్థల్లో అమల్లోకి రానుంది. ఈ యోగా బ్రేక్ లో 5 నిమిషాల్లో పూర్తి చేయగల కొన్ని
తేలికైన వ్యాయామాలుంటాయి. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయం, యోగా నిపుణుల సాయంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ వై-బ్రేక్
ప్రొటో కాల్ ట్రయలు సోమవారం ప్రారంభించింది. ఇందులో పాల్గొనడానికి టాటా కెమికల్స్,
యాక్సిస్ బ్యాంక్, ఎర్నెస్ట్ అండ్ యంగ్
గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ తదితర 15 సంస్థలు ఆసక్తి చూపించాయని ఓ అధికారి
తెలిపారు. ఈ వై-బ్రేక్ అనేది యోగా కోర్పు కాదని, కానీ
కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మాడ్యూల్ అని పేర్కొన్నారు. యోగా ప్రొటో కాల్స్ తయారీ
ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని తెలిపారు. వై-బ్రేక్ అభ్యాసంలో భాగంగా ఒక బుక్లెట్
తయారు చేశామని, పనిస్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించిన
స్థితులతో కూడిన వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
0 Komentar