63 thousand Job vacancies in AP
ఏ.పి. లో ఉద్యోగ ఖాళీలు 63వేలు..!
విద్య, వైద్య
రంగాల్లో భర్తీకి తొలి ప్రాధాన్యం...!
ముఖ్యమంత్రి సమీక్ష
ప్రభుత్వ శాఖల్లో సుమారు 63వేల
ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఇంకా అధ్యయనం
జరుగుతున్నందున ఈ సంఖ్య మరో 10-15వేల వరకు పెరగవచ్చునని
భావిస్తున్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ-క్యాలెండర్ విడుదలపై ముఖ్యమంత్రి జగన్
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జనవరి 31న సమావేశాన్ని
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వైద్య శాఖలో..
వైద్యులు, నర్సులు, ల్యాబ్
టెక్నీషియన్లు, ఫార్మసిస్టు పోస్టులు, ప్రభుత్వ
పాఠశాలల్లో అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు జరగాలి. ఈ రెండు రంగాల్లో
ప్రభుత్వం చేపట్టే పథకాలు విజయవంతం కావాలంటే అందుకు అనుగుణంగా నియామకాలకు
ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి శాఖలోని ఉద్యోగాలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా
భర్తీ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వీక్లీ ఆఫ్‌లు ప్రకటించినందున పోలీసు
శాఖలో సామర్థ్యం తగ్గకూడదు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా
ఫిబ్రవరి 3 వారంలో మరోసారి సమావేశాన్ని ఏర్పాటుచేస్తే ఆ
సమయానికి పూర్తి వివరాలతో వస్తామని అధికారులు చెప్పగా సీఎం అంగీకరించారు.
మార్చిలో నియామకాల వార్షిక
ప్రకటనలు..
*ప్రాథమిక సమాచారం
ప్రకారం...ఏపీపీఎస్సీ ద్వారా 19,000 ఉద్యోగాలను భర్తీ చేసే
అవకాశాలు ఉన్నాయి.
*డీఎస్సీ ద్వారా 21వేల ఉపాధ్యాయులు, ఇతర పోస్టులు భర్తీ జరిగే అవకాశం
ఉంది.
*పోలీసు శాఖలో 13వేలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.
*ఈ ఏడాది ఉద్యోగ నియామకాల
వార్షిక ప్రకటనల జారీ మార్చిలో జరిగే అవకాశం ఉంది.
*మార్చిలో నియామకాల వార్షిక
ప్రకటనలు..
0 Komentar