వేసవి కాలం ప్రతి ఒక్కరిని అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం అనేక రకాల పానీయాలు త్రాగుతూ ఉంటాము. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్ లు, షరబత్ లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలని అనిపిస్తుంది. ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలిగించకుండా శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించ గల పానీయం ఏదైనా ఉందా అని అడిగితే అందుకు ఒక గొప్ప సమాధానం సబ్జా గింజల పానీయం. సబ్జా గింజలు అంటే మరేంటో కాదండి “తులసి విత్తనాలు”. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానపెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
సబ్జా గింజల పానీయం తయారీ విధానం:
గుప్పెడు సబ్జా గింజలను తీసుకొని మంచి నీళ్లతో వాటిని శుభ్రం చేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు కొంత జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని కొంత పంచదార వేసుకొని త్రాగండి. ఈ నీళ్లు ఎంతో రుచికరంగా ఉంటుంది.
సబ్జా గింజల యొక్క ఆరోగ్య
ప్రయోజనాలు:
*అధిక బరువు, మలబద్ధకం,
మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస
వంటి వ్యాధులకు కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది.
*సబ్జా గింజల్లో పీచు (ఫైబర్)
ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక
గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య తొలగిపోతుంది.
*జీర్ణ వ్యవస్థలోని ప్రేగులలోని
వాయువు నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడే వోలటైల్ నూనెలు ఈ గింజలో ఉంటాయి. అంతే
కాదు,
శరీరంలోని వ్యర్థాలు (టాక్సిన్స్) కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం
శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం,
అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
*ఊబకాయంతో బాధపడే వారు ప్రతి రోజు
ఆహారం తీసుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని తాగితే కడుపు నిండిన భావన
కలుగుతుంది. తద్వారా తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు
చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కేలరీలు కూడా చాలా తక్కువే.
*సబ్జా గింజల నీటిని తాగితే
మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి. నానబెట్టిన
సబ్జా గింజలను గ్లాసు పచ్చి పాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా
కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారిలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రించ
బడుతుంది.
*విత్తనాలను నానబెట్టకుండా, చూర్ణం
చేసి ఒక కప్పు కొబ్బరి నూనెలో కలిపి ప్రభావిత ప్రాంతాలపై పూయడం ద్వారా తామర మరియు
సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది.
*తులసి విత్తనాలను క్రమం తప్పకుండా
తినడం వల్ల మీ శరీరం కొల్లాజెన్‌ను స్రవిస్తుంది. ఇది కొత్త చర్మ కణాల ఉత్పత్తిలో
సహాయపడుతుంది. ఈ విత్తనాలలో ఐరన్, విటమిన్ కె మరియు ప్రోటీన్ ఉన్నాయి.
*పొడవాటి మరియు బలమైన జుట్టుకు ఈ
ఖనిజాలు ఎంతో అవసరం. ప్రోటీన్ మరియు ఐరన్ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
మరియు వాల్యూమ్‌ను పెంచుతుంది.
*తరచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు
సబ్జా గింజల పానీయం తాగితే ఎంతో మంచిది. రెగ్యులర్ గా త్రాగడం వలన శరీరంలోని
ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
*వికారంగా, వాంతి
వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం.
*గొంతు మంట, దగ్గు,
ఆస్తమా, తలనొప్పి, జ్వరం
వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
*సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన
ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి కనుక ఈ
పానీయం తాగితే మహిళలకు ఎంతగానో అవసరమైన ఫోలేట్, నియాసిన్,
విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి.
*సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే
కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.
*ఈ గింజలు దగ్గును నియంత్రించడంలో
సహాయపడతుంది.
*ఇవి శరీరం యొక్క రోగనిరోధక
శక్తిని బలపరుస్తుంది.
*ఇందులోని వైసెనిన్, ఓరింటిన్
మరియు బీటా కెరోటిన్ వంటి ఫ్లవనాయిడ్లు శరీరం యొక్క రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
Good information ���� ��
ReplyDelete