CM YS JAGAN REVIEW MEETING ON EDUCATION
DEPARTMENT
జగనన్న గోరుముద్ద, జగనన్న
విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, స్కూల్
కిట్స్, పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం, ఇంగ్లీష్ మీడియం విద్యా ప్రణాళికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి
ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త పాఠ్య
పుస్తకాలు, వర్క్ బుక్స్‌ను సీఎం వైఎస్ జగన్
పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన కిట్స్ అందాలని ఈసందర్భంగా ఆయన స్పష్టం
చేశారు. పాఠశాలల్లో నాడు-నేడు పనులపై సీఎం అధికారులను ఆరా తీయగా.. అన్ని స్కూళ్లల్లో
పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.
గోరుముద్దతో మంచి ఫలితాలు..
గోరుముద్ద కార్యక్రమంతో మంచి
ఫలితాలు వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ పథకంపై యాప్‌ను సిద్ధం
చేస్తున్నామని చెప్పారు. యాప్‌లో ఏ రోజు ఏ మెనూ అనే వివరాలు ఉండాలని సీఎం వైఎస్
జగన్ సూచించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే యాప్‌లో తెలియాలని
అన్నారు. మార్పు అనేది విద్య నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాక్షించారు. టీచర్స్
ట్రైనింగ్, కరిక్యులమ్, వర్క్‌బుక్స్,
టెక్ట్స్‌బుక్స్ విషయంలో అధికారుల పనితీరును సీఎం అభినందించారు.
విద్యార్థులకు మోరల్స్, ఎథిక్స్ క్లాసులు కూడా ఉండాలని
చెప్పారు. దివ్యాంగుల కోసం పులివెందులలో వైఎస్సార్ ఫౌండేషన్ నడుపుతున్న విజేత
స్కూల్ సక్సెస్ స్టోరీని అధికారులు సీఎం వద్ద ప్రస్తావించారు. దివ్యాంగులకు
పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఒక రోజు ట్రైనింగ్ : మంత్రి
ఆదిమూలపు
‘జగనన్న గోరుముద్ద’ మెనూ గురించి ఒక రోజు ట్రైనింగ్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు
సురేష్ తెలిపారు. కొంతమంది రిసోర్సింగ్ పర్సన్స్‌ను నియమిస్తామని వెల్లడించారు.
నాడు-నేడులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటుపై సమీక్షించామని తెలిపారు.
వచ్చే వారంలోపు 15 వేల స్కూళ్లల్లో పనులు మొదలు పెడతామని
చెప్పారు. 40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక
అందజేస్తామని మంత్రి తెలిపారు. రూ.100 కోట్లకు మించిన
టెండర్లును జ్యూడీషియల్ రివ్యూకి ఇస్తామని మంత్రి తెలిపారు.
0 Komentar