DR. YSR VILLAGE CLINICS
ఇక
వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు
రాష్ట్రంలో
ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా
విలేజ్ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష
నిర్వహించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో
వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండాలన్నారు. అందులో బీఎస్సీ
నర్సింగ్ చదివిన స్టాఫ్ అందుబాటులో ఉండాలని చెప్పారు. విలేజ్ క్లినిక్ అనేది
రెఫరల్ పాయింట్‌లా ఉండాలని, ప్రతి రోగికి ప్రాథమిక వైద్యం
అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో
ఎవరికైనా ఏదైనా జరిగితే విలేజ్ హెల్త్ క్లినిక్‌లో ఉచితంగా ప్రాథమిక వైద్యం
అందుతుందనే భరోసా కల్పించేలా వీటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇక్కడికొచ్చే రోగులకు రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందేలా చర్యలు
తీసుకోవాలన్నారు. చిన్న ఆరోగ్య సమస్యలకు ఇక్కడే వైద్యమందితే దూరం వెళ్లే ఇబ్బందులు తప్పుతాయని, విలేజ్ క్లినిక్‌లోనే మందులు అందిస్తే రోగులు సంతృప్తి వ్యక్తం
చేస్తారన్నారు.
బోధనాసుపత్రుల్లో
మౌలిక సదుపాయాల కల్పన
రాష్ట్రంలో
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికొక బోధనాసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్
అధికారులతో అన్నారు. 25 పార్లమెంటు
నియోజకవర్గాల్లో 25 బోధనాసుపత్రులు ఉంటే ప్రజలకు స్పెషాలిటీ
సేవలు మరింత చేరువవుతాయని చెప్పారు. మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నామని,
ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుని
ముందుకెళ్లాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 టీచింగ్
ఆసుపత్రులు ఉన్నాయని, మరో 7 వైద్య
కళాశాలలకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయని ఈ సందర్భంగా సీఎంకు ఆ శాఖ అధికారులు
వివరించారు. బోధనాసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, డాక్టర్లు, నర్సుల కొరతను అధిగమించాలని సీఎం
సూచించారు. ప్రతి టీచింగ్ ఆసుపత్రిలో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండేలా చూడాలని
పేర్కొన్నారు.
0 Komentar