2003-డీఎస్సీ ఉపాధ్యాయులకు
పాత పింఛను విధానం..!
ఈనాడు, న్యూస్
: కేంద్ర ప్రభుత్వ పింఛను వ్యవహారాల శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు తెలుగు
రాష్ట్రాల్లోని దాదాపు 16 వేల మంది ఉపాధ్యాయులకు ఊరట
కలిగించనున్నాయి. వారికి పాత పింఛన్ పథకం వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులకు 2004 జనవరి 1 నుంచి సీపీఎస్
అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2004 జనవరి 1వ తేదీ తర్వాత నియామకమైన ఉద్యోగులకూ పాత
పింఛన్ పథకం వర్తిస్తుంది. అయితే సదరు నియామకాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు 2004 జనవరి 1వ తేదీ కంటే ముందు ప్రకటించి ఉండాలి. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబరు 1వ
తేదీ నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ ప్రకారం 2004 సెప్టెంబరు 1 నుంచి నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ వర్తిస్తుంది. కాగా 2003 డీఎస్సీ నియామకాలు 2005 నవంబరులో జరిగాయి. ఫలితాలు
మాత్రం 2004 జులై నెలలోనే ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో
సీపీఎస్ విధానం అమల్లోకి రాకముందే 2003 డీఎస్సీ ఫలితాలు
ప్రకటించినందున వారికి పాత విధానం అమలు చేయాల్సి ఉంటుందని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర
గౌరవ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర
అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డిలు తెలిపారు. ఆ డీఎస్సీ ద్వారా రెండు రాష్ట్రాల్లో 16,449 మంది ఉపాధ్యాయులు నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో
విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు.
ఆ ఉద్యోగులకు సీసీఎస్ పింఛను
★ కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులకు ప్రభుత్వం స్వల్ప ఊరట కల్పించింది. 2003 డిసెంబరు
31 నాటికి నియామక పరీక్షల ఫలితాలు వెల్లడై, ప్రక్రియ పూర్తయి పరిపాలన కారణాలతో చేరిక ఆలస్యమైన ఉద్యోగులకు పాత పింఛను
(సీసీఎస్) నిబంధనలను వర్తింపజేయనున్నట్లు తెలిపింది.
★ అర్హత పరిధిలోకి వచ్చే
వారు 2020 మే 31లోగా ఆప్షన్
ఎంచుకోవాలని సూచించింది. 2004 జనవరి 1
తరువాత ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రస్తుతం జాతీయ పింఛను విధానం అమలవుతోంది.
★ ప్రభుత్వ విభాగాల్లో 2003 డిసెంబరు 31 నాటికే నియామకాలు పూర్తయినప్పటికీ
పరిపాలన, పోలీసు తనిఖీ తదితర సాంకేతిక కారణాలతో చేరికలు
ఆలస్యమయ్యాయి.
★ పరిపాలన కారణాలతో
ఆలస్యమైనందున అర్హులకు సీసీఎస్ నిబంధనలు కొనసాగించాలని ఉద్యోగులు విజ్ఞప్తి.
★ ఈ నేపథ్యంలో సీసీఎస్‌లో చేరికపై
మార్గదర్శకాలు, అర్హతలను కేంద్రం పేర్కొంది. ఈ ఆప్షన్
ఎంచుకున్న అర్హత కలిగిన ఉద్యోగులకు 2020 సెప్టెంబరు 30 నాటికి సంబంధిత పత్రాలు జారీ చేస్తామని, నవంబరు 1 నుంచి జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) ఖాతా మూసివేస్తామని వివరించింది.
2003-డీఎస్సీ టీచర్లకు గుడ్ న్యూస్!
Government of India, Department of Pension and PM Memorandum No 57/04/2019-P&PW(B) తేదీ 17.02.2020 ద్వారా ఒక విష్పష్టమైన వివరణ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కొత్త పెన్షన్ పథకం 1వ తేదీ, జనవరి, 2004 నుంచి అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పైన పేర్కొన్న memo క్లారిఫికేషన్ ప్రకారం.... 1వ తేదీ జనవరి, 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకూ పాత పెన్షన్ స్కీం వర్తించనుంది. అయితే, దీనికి కండిషన్ ఏంటంటే.... సదరు నియామకాలకు సంబంధించిన టెస్ట్/ఎక్జామ్ ఫలితాలు ఫస్ట్ జనవరి, 2004 కి ముందే ప్రకటించబడి ఉండాలి. సదరు ఉద్యోగులు ఈ ఏడాది మే 31లోగా CSS 1972 లోకి మారడానికి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఆప్షన్ ఇవ్వని పక్షంలో CPSలోనే కొనసాగుతారు.
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో తేదీ 1-9-2004 నుంచి CPS విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 1వ తేదీ సెప్టెంబర్ 2004న లేదా ఆ తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు CPS వర్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, 2003 డీఎస్సీ నియామకాలు నవంబర్, 2005లో జరిగినప్పటికీ, ఫలితాలు మాత్రం జూన్, 2004 లోనే ప్రకటించారు. అంటే, రాష్ట్రంలో CPS విధానం అమల్లోకి రాకముందే 2003 డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. కాబట్టి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు OPS అమలు కావడం తథ్యం.
0 Komentar