High Protein diet for weight loss
ప్రస్తుతం అందరినీ వేధించి సమస్య
అధిక బరువు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో పీచుపదార్థం, పిండిపదార్థాలు
సమతుల్యం కొరవడింది. ప్రజలు పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు
చుట్టుముడుతున్నాయి. వ్యాయామం/నడక చాలావరకూ ప్రజలు మరచిపోయారు. మరి బరువు
తగ్గాలనుకునేవారు తక్కువ తినడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని చెబుతున్నారు
పోషకాహార,
ఆరోగ్య నిపుణులు. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా
జరిగేందుకు తోడ్పడుతాయి.
బరువు తగ్గడానికి ఉపయోగపడే అధిక ప్రోటీన్స్
గల ఆహారపదార్ధాలు కొన్ని...
మొలకెత్తిన విత్తనాలు: వీటిలో
కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా
వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు
ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా
మంచిది.
నట్స్: బఠాణీ, బాదం,
జీడిపప్పు, వాల్‌నట్స్‌లో గ్లూటెన్ ఉండదు.
వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా
ఉంటాయి.
సెనగలు: వీటిలో
ప్రొటీన్స్, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు.
కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి.
మినప పప్పు: మినపపప్పులో
శరీరానికి అవసరమైన ప్రొటీన్ ఉంటుంది. మినప పప్పుతో సాయత్రం స్నాక్‌గా ఇడ్లీలు
చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి.
ఎండు బఠాణి: ప్రొటీన్స్, కొవ్వులు,
పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
0 Komentar