Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ONGC Scholarships

ONGC Scholarships


ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) 1,000 స్కాలర్ షిప్ లను అందిస్తోంది. ఓబీసీలకు 500, ఈబీసీలకు 500 చొప్పున విడి విడిగా వీటిని ఇస్తున్నారు. రెండు విభాగాల్లోనూ 50శాతం స్కాలర్ షిప్ మహిళలకు కేటాయించారు. ఎంపికైనవారికి ఏడాదికి రూ. 48,000, చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు ఉపకార వేతనం అందిస్తారు.
అర్హత: తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకుండా, వయసు జనవరి 1, 2020 నాటికి 30 ఏళ్లు దాటని  భారత్ లో ఏదైనా విద్యాసంస్థలో ఫుల్ టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్న వారు అర్హులు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సునైనా అభ్యసిస్తున్న ప్రదమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎమ్మెస్సీ జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ. కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి.
ఎన్ని స్కాలర్ షిప్ లు: ఓబీసీ, ఈబీస్ ఒక్కో విభాగంలోనూ ఇంజినీరింగ్ 300, ఎంబీబీఎస్ 50, ఎంబీఏ 50, జియాలజీ లేదా జియోఫిజిక్స్ కు వంద చొప్పున స్కాలను కేటాయించారు. దేశాన్ని 5 జోన్లగా తీసుకుని ఒక్కో జోన్ నుంచి ఒక్కో విభాగంలోనూ వంద మందికి అందిస్తారు. అభ్యర్థులు చదువుతున్న కళాశాల ప్రకారం జోన్ నిర్ణయిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థి చేరిన కోర్సు ఆధారంగా ఇంటర్ లేదా డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ONGC వెబ్ సైట్లో వివరాలు నమోదుచేయాలి. అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.
చివరి తేదీ: మార్చి 5
Apply for Scholarship CLICK HERE
Official Website CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags