Teacher Jobs in USA
అమెరికాలోని టెక్సాలో ఉన్న పలు జిల్లా పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎస్ఆర్టీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంగ్లం, ప్రత్యేక విద్య (స్పెషల్ ఎడ్యుకేషన్) బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల దరఖాస్తులు చేసుకోవచ్చని సంస్థ అధ్యక్షులు మేడపాటి వెంకట్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎడ్/ఎంఈడీ కలిగి బోధనారంగంలో 5 ఏళ్ల అనుభవం కలిగినవారు అర్హులు. స్పెషల్ ఎడ్యుకేటర్ సర్టిఫైడ్ అయిన ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఉంటుంది. వీసా పొందేందుకు టోఫెల్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. నియామక ప్రక్రియకు ఎలాంటి రుసుం ఉండదు. ఆసక్తిగలవారు మార్చి 5వ తేదీలోపు https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
0 Komentar