Uses of red rice
ఎర్ర బియ్యం వలన కలిగే ఉపయోగాలు
చాలామందికి బయట ఎన్ని తిన్నా, ఎంత
తిన్నా ఇంటికి వచ్చాక కొద్దిగానైనా సరే అన్నం ముద్ద నోటిలోకి దిగాల్సిందే. కానీ
అన్నం ఎక్కువగా తింటే లావెక్కుతారని చాలామంది మితంగా తింటూ ఆకలిని చంపుకుంటూ
ఉంటారు. అయితే ఎర్ర బియ్యం తింటే లావెక్కరంట. పైగా పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. మరి
ఎర్ర బియ్యం వలన కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
>హానికరమైన చెడు కొవ్వును
తగ్గించి గుండెకు రక్తసరఫరా మెరుగయ్యేలా చేస్తుంది. ఈ రైస్ తినేవారికి గుండెపోటు
వచ్చే ప్రమాదాలు కూడా తక్కువే.
>ఎర్ర బియ్యంలో ఫైబర్ మెండుగా
ఉంటుంది. సులువుగా జీర్ణం అవుతుంది.
>ఎర్ర బియ్యంలో
ఆంటీయాక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
>ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి
దోహదపడే సెలెనీయం గాయాలను త్వరగా మాన్పేందుకు సహకరిస్తుంది.
>మధుమేహాన్ని నియంత్రించే
గ్లైసిమిక్ ఇండెక్స్ ఎర్రబియ్యంలో ఉన్నాయి. రక్తంలో చక్కెర లెవల్‌ను
బ్యాలెన్సింగ్ చేస్తూ డయాబెటిస్ దరిచేరకుండా దోహదపడుతుంది.
>మెగ్నీషియం ఉండటం
వలన ఆక్సిజన్ సరఫరా సులువుగా జరుగుతుంది. ఆస్తమాను తగ్గిస్తుంది.
>కాస్త తినగానే
కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మితంగానే తింటూ మీ బరువు పెరగకుండా
చూసుకోవచ్చు.
>కొవ్వును తగ్గించి హృదయ సంబంధ
వ్యాధులను నివారిస్తుంది.
>ఎముకలకు ఇది మంచి ఔషధం.
కాల్షియం,
మెగ్నీషియం మెండుగా ఉండటంతో కీళ్లు పటిష్టంగా ఉంటాయి.
వండటం ఎలా ?
ముందుగా మనకు కావాల్సిన మోతాదులో
ఎర్ర బియ్యాన్ని తీసుకుని గంట సేపు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఒక కప్పు
బియ్యానికి నాలుగు కప్పుల చొప్పున నీళ్లను మరిగించి తర్వాత అందులో బియ్యం వేసి
తక్కువ మంటపై ఉంచాలి. మరో 20 నిమిషాల్లో వేడి వేడి అన్నం
సిద్ధమైపోతుంది.
0 Komentar