ప్రేమికుల రోజు (ఫిబ్రవరి
14) - ప్రేమికుల రోజు వెనుక అసలు కథ ఇదే
ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే. ప్రేమికుల రోజు అని కూడా అంటారు. కొన్నేళ్లుగా
వాలెంటైన్స్ డే చాలా పాపులర్ అయింది. అసలు వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారో
తెలుసా? ఆ ఆసక్తికర కథ ఏంటో తెలుసుకోండి.
1. తల్లుల కోసం మదర్స్ డే,
తండ్రుల కోసం ఫాదర్స్ డే, సోదరీమణుల కోసం
సిస్టర్స్ డే, మహిళల కోసం వుమెన్స్ డే... ఇలా అందరికీ
ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్టు ప్రేమికుల కోసం ప్రేమికుల రోజు ఉంది. ఆ రోజునే
వాలెంటైన్స్ డే అంటారు.
2. అసలు ప్రేమను వ్యక్తం
చేయడానికి ఒక రోజు అంటూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరమే లేదు. ప్రేమను
ఎప్పుడైనా ఎలాగైనా వ్యక్తం చేయొచ్చు. అయితే వాలెంటైన్స్ డే జరుపుకోవడం వెనుక ఓ
చరిత్ర ఉంది. అసలు వాలెంటైన్స్ డే అంటే ఏంటీ? ఆ రోజును
ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు? ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకొంటారు? తెలుసుకుందాం.
3. వాలెంటైన్స్ డే ఎందుకు
జరుపుకొంటారు అన్న ప్రశ్నకు రకరకాల సమాధానాలున్నాయి. వేర్వేరు చరిత్రలున్నాయి.
అందులో బాగా ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం వాలెంటైన్ గురించి.
4. ఈ వాలెంటైన్స్ డే
ఇప్పటిది కాదు. క్రీస్తు శకం 270 నాటిది. హింస, స్వార్థం, ద్వేషం లాంటి దుర్గుణాలపై పోరాడటానికి
ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మేవాడు క్రైస్తవ మతగురువు వాలెంటైన్. క్రీస్తు శకం 270 కాలంలో రోమ్‌లో ఉండేవాడు. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని యువకులకు
బోధించేవాడు.
5. యువతీ యువకుల మధ్య ప్రేమ
చిగురించేలా చేసేవాడు వాలెంటైన్. అంతేకాదు... ప్రేమలో మునిగితేలుతున్న
యువతీ యువకులకు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించేవాడు. ఆ సమయంలో రోమ్‌ను పాలిస్తున్న
చక్రవర్తి పేరు క్లాడియస్. క్రూరాతి క్రూరమైన రాజు.
6. ఆ రాజుకు ప్రేమ
పెళ్లిళ్లు కాదు కదా అసలు పెళ్లిళ్లంటేనే ఆ చక్రవర్తికి ఇష్టం లేదు. అందుకే
పెళ్లిళ్లపై నిషేధం విధించాడు. ఓవైపు పెళ్లిళ్లు అంటే ఇష్టం లేని రాజు
క్లాడియస్... మరోవైపు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్న వాలెంటైన్.
7. ఆ రాజ్యంలో ప్రేమ
పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. ఏం జరుగుతుందా అని క్లాడియస్ ఆరా తీశాడు. వాలెంటైన్
ప్రేమ పాఠాల గురించి తెలిసింది. అంతే... ఈ ప్రేమలకు, పెళ్లిళ్లకు
వాలెంటైన్ కారణమని తెలుసుకున్న క్లాడియస్ అతడిని బంధించాడు.
8. రాజద్రోహం చేశాడన్న
ఆరోపణలతో మరణశిక్ష విధించాడు. అయితే ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్లకు కారణమైన
వాలెంటైన్... జైలులో ఉండగా జైలు అధికారి కూతురితో ప్రేమలో పడ్డాడు.
9. వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. చనిపోయేవరకు ప్రియురాలి గురించే తలచుకుంటూ ఉన్నాడు
వాలెంటైన్. 'Your Valentine' అని ఆమెకు ఓ లేఖ కూడా రాశాడు.
అలా 'Your Valentine' అనే మాట ప్రేమికుడికి పర్యాయ పదంగా
మారిపోయింది.
10. ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ను ఉరి తీశారు కాబట్టి అదే రోజున వాలెంటైన్స్ డే అంటే
ప్రేమికుల రోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే భారతదేశంలో మాత్రం ప్రేమికుల
దినోత్సవం జరుపుకోవడం 1990వ దశకంలో మొదలైంది. ఆర్థిక సరళీకరణ
తర్వాత వాలెంటైన్స్ డే ఇండియాలో పాపులర్ అయింది.
11. వాలెంటైన్స్
జరుపుకోవడంపై వివాదాలు కూడా ఉన్నాయి. ఇది ప్రేమికుల రోజు భారతదేశ సంస్కృతి కాదంటూ వ్యతిరేకించేవాళ్లున్నారు.
వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు... విశ్వహిందూ పరిషత్, శివసేన,
భజరంగ్‌దళ్, శ్రీరాం సేన లాంటి హిందుత్వ
సంస్థలు రంగంలోకి దిగుతుంటాయి.
12. ప్రేమికుల రోజును
వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలు, గొడవలు
మామూలే. ఇక ప్రేమికుల రోజు కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన మాయ అన్న వాదన మరొకటి
ఉంది. ఎందుకంటే వాలెంటైన్స్ డే సందర్భంగా వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది.
13. అసలు ప్రేమను వ్యక్తం
చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరమా? ప్రేమకు డేట్స్,
డెడ్‌లైన్స్ ఉంటాయా? అనంతమైన ప్రేమను ఏడాదంతా
వ్యక్తం చేసినా సమయం చాలదు కదా? అనేవాళ్లు ఉంటారు.
14. ప్రేమను సెలబ్రేట్
చేసుకోవడానికి ఓ రోజును కేటాయిస్తే తప్పేముంది అనేవాళ్లూ ఉన్నారు. సో...
వాలెంటైన్స్ డే చుట్టూ జరిగే చర్చ కూడా ప్రేమలా అనంతమైనది. శాశ్వతమైనది.
Best lovoers in the world are wife and husband relationship. So in our Indian culture it has been continuing till todate. (Feb- 14 th)
ReplyDelete