Vindam Nerchukundam
IRI 17th-20th February Programme details
★ "విందాం -
నేర్చుకుందాం"..
★ నేటి
రేడియో పాఠం
★ తేదీ
: 20-02-2020
★ పాఠం
పేరు : "Learn English is Fun"..
★ సమయం
: 11 AM
★ నిర్వహణ
సమయం : 30 ని.లు
................................................................
★ "విందాం - నేర్చుకుందాం"..
★ నేటి రేడియో పాఠం
★ తేదీ : 19-02-2020
★ తరగతి : 3
★ పాఠం పేరు : EVS
★ తరగతి : 3
★ పాఠం పేరు : EVS
★ పాఠం పేరు : ఊరికి పోదాం
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
✡ *బోధనా లక్ష్యాలు:**విద్యార్థినీ విద్యార్థులు :*
• ప్రయాణం అంటే ఏమిటో తెలుసుకుంటారు.
• వివిధ ప్రయాణ సాధనాలు మరియు ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు.
• ప్రయాణించే దూరం, అవసరాన్నిబట్టి ఉపయోగించే వివిధ రకాల వాహనాల గురించి తెలుసుకుంటారు.
• ప్రయాణంలో ప్రమాదాలు నివారించడం గురించి తెలుసుకుంటారు.
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• పాఠ్యపుస్తకం
• వివిధ ప్రయాణ సాధనాల చార్టు
• పాఠ్యపుస్తకంలోని 136 వ పేజీలోని చిత్రపటాల జిరాక్స్
• సుద్దముక్క
• Fevistic (Gum)
పై బోధనాభ్యసన సామాగ్రిని సిద్ధంగా ఉంచుకొని రేడియో టీచర్ సూచనల కనుగుణముగా వినియోగించాలి.
★★★★★★★★★★★★★
✡ *ప్రసార పూర్వ కృత్యాలు:*
అ) రేడియో పాఠం వినడానికి సంసిద్ధత (విద్యార్ధులను) గావించాలి
ఆ) బోధనాభ్యసన సామాగ్రి సమకూర్చుకోవాలి.
ఇ) రేడియో పాఠంలో ప్రసారం కాబోయే ఆటను ఆడించే విధానం తెలుసు కోవాలి.
★★★★★★★★★★★★★
✡ *ప్రసార సమయంలో కృత్యాలు:*
*కృత్యముః*
ఈ కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి
• పాఠ్యపుస్తకంలోని 136వ పేజీలోని బొమ్మలను జిరాక్స్ తీసుకొని, వానిని చిత్రాలుగా కత్తిరించి, వాటిని మడత పెట్టవలెను.
• పాఠ్యపుస్తంలోని 135వ పేజీలోని విధముగా నల్లబల్ల పై రోడ్డుమీద ప్రయాణించేవి. వీటిలో ప్రయాణించేవి, గాలిలో ప్రయాణించేవి అనే టేబుల్ ను గీయవలెను.
• విద్యార్థులను 3 గ్రూపులుగా చేయవలెను.
• మడిచి చీటీలను టేబుల్ పై ఉంచండి, ప్రక్కనే Fevistic (Gum) ఉంచండి.
• రేడియో నందు ఈల శబ్దం రాగానే గ్రూపులో విద్యార్థి వెళ్ళి టేబుల్ పై నున్న చీటీని తీసి అది ఏ రకానికి చెందిన వాహనమో, నల్లబల్ల పై ముందుగా మీరు వ్రాసిన టేబుల్ నందు అతికించాలి.
• రేడియో టీచర్ గీతక్క సూచనలు జాగ్రత్తగా వింటూ, విద్యార్థులు కృత్యం నందు ఉత్సాహంగా పాల్గొనేటట్లు చూడండి.
• ఈ విధముగా రేడియో టీచర్ సూచనలు పాటిస్తూ కృత్యం నిర్వహించవలెను.
*ఆట :*
• ఆట పేరు *"వలయం - వాహనం”*
• బస్సు, ఆటో, సైకిలు, ఓడ, నౌక, విమానం, హెలీకాప్టర్, ఎడ్లబండి చిత్రాలను చీటీలుగా మడచి పెట్టండి. వాటిని ఓ Box నందు ఉంచండి.
• విద్యార్థులను వలయంగా గుండ్రముగా కూర్చోబెట్టండి. ఒక విద్యార్థిని పిలవండి. ముందుగా మడచిన చిత్రాలనుంచిన Box ఇవ్వండి.
• రేడియోలో Music వస్తున్నంత సేపు చీటీలుంచిన Box పట్టుకున్న విద్యార్థి కూర్చున్న విద్యార్థుల వలయం చుట్టూ పరుగెత్తుతుండాలి.
• రేడియోలో Music ఆగినంతనే పరుగెత్తే విద్యార్థి పరుగు ఆపవలెను. ఎవరి ముందు విద్యా ర్థి నిలబడినాడో, ఆ విద్యార్థికి Box నుండి ఒక చీటీ ఇవ్వవలెను.
• చీటీ తీసుకొన్న విద్యార్థి, ఆ చీటీలోని వాహనం రోడ్డుపై వెళ్తుందా, గాలిలో వెళ్తుందా, నీటిలో వెళ్తుందో చెప్పాలి.
• రేడియో టీచర్ గీతక్క సూచనలను విద్యార్థులు సరిగా పాటించినట్లు చూడవలెను. ఆట నందు అందరి విద్యార్థులు ఉత్సాహముగా పాల్గొననునట్లు చూడవలెను.
• ఈ విధముగా “వలయం - వాహనం" ఆట ఆడించవలెను.
★★★★★★★★★★★★★
✡ *పాఠం పై గేయం :*
• కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై వ్రాసి స్పష్టంగా కనిపించేలా తరగతి గదిలో ప్రదర్శించాలి.
• గేయాన్ని రెండవసారి వచ్చునపుడు సామూహికంగా చార్టును చూస్తూ పాడించండి.
★★★★★★★★★★★★★
*🎼 పాట*
*🎤 పల్లవి :*
బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా
సరుకుల రవాణా చేయాలన్నా
ప్రయాణ సాధనం కావాలి
రవాణా మార్గం ఉండాలి //బంధువుల//
*🎻 చరణం 1:*
బస్సు, లారీ వెళ్ళేది రోడ్డుపైనే, రోడ్డు పైనే
చుక్ చుక్ రైలు నడిచేది పట్టాలపైనే, పట్టాలపైనే,
రెక్కల విమానం ఎగిరేది గాలిలో, ఆకాశంలో
చక్కని ఓడ నడిచేది జలమార్గంలో, జలమార్గంలో //బంధువులు//
*🎻 చరణం 2:*
మనం రోడ్డు పై నడవాలన్నా
రోడ్లపై వాహనం నడపాలన్నా
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
ప్రమాదాల నివారణకు తోడ్పడాలి //బంధువులు//
★★★★★★★★
*✡ పాట ప్రసార సమయంలో:*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
★ "విందాం -
నేర్చుకుందాం"..
★ నేటి
రేడియో పాఠం
★ తేదీ
: 18-02-2020
★ పాఠం
పేరు : "TTP"..
★ సమయం
: 11 AM
★ నిర్వహణ
సమయం : 30 ని.లు
------------------------
★ నేటి రేడియో పాఠం
★ తేదీ : 17-02-2020
★ పాఠం పేరు :
" మానవ కంప్యూటర్"
★ తరగతి : 5
★ సమయం : 11 AM
★ నిర్వహణ సమయం
: 30 ని.లు
నేటి రేడియో పాఠం :
"మానవ కంప్యూటర్" (17.02.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా
సామాగ్రి, ప్రసారానికి ముందు,ప్రసార
సమయంలో చేయవలసిన కృత్యాలు, పాట...
0 Komentar