Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vindam Nerchukundam IRI 3rd-7th February Programme details

Vindam Nerchukundam IRI 3rd-7th February Programme details


విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 07-02-2020
విషయం : గణితం
పాఠం పేరు : "ఒకే విధమైన సగాలు"..
తరగతి : 4వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
నేటి రేడియో పాఠం : "ఒకే విధమైన సగాలు" (07.02.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, ప్రసార పూర్వ కృత్యాలు, పాట..
Download... 7th February IRI Programme details
"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 06-02-2020
విషయం : పరిసరాల విజ్ఞానం
పాఠం పేరు : "నేరు మన అవసరాలు"
తరగతి : 3వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు

〰〰〰〰〰〰〰〰 
✳ *నీరు మన అవసరాలు* 
〰〰〰〰〰〰〰〰 
✡ *బోధనా లక్ష్యాలు:*
*విద్యార్థినీ విద్యార్థులు :*
• నీరు ఆవశ్యకతను గురించి తెలుసుకుంటారు
• నీటి వనరుల గురించి తెలుసుకుంటారు
• నీటి ఉపయోగాల గురించి తెలుసుకుంటారు
• త్రాగేనీరు శుభ్రత గురించి తెలుసుకుంటారు
• నీటిని పొదుపు చేయడం గురించి తెలుసుకుంటారు
★★★★★★★★★★★★★
✡ *బోధనాభ్యసన సామగ్రి:*
• చార్టు • పాఠ్యపుస్తకం • సుద్దముక్కలు • గమ్ • స్కెచ్ పెన్లు
*చార్టుపై వ్రాయవలసిన అంశములు*
స్నానం చేయడం,    నీళ్ళు తాగడం,    బట్టలు ఉతకడం,     ముఖం కడగడం,    అన్నం వండడం,    పప్పు వండడం,    వరి పండించడం,    మొక్కజొన్న పండించడం,     ఏనుగు స్నానం చేయడం,     కుక్క స్నానం చేయడం.
★★★★★★★★★★★★★
✡ *ప్రసార పూర్వ కృత్యాలు:*
అ) రేడియో పాఠం వినడానికి సంసిద్ధత (విద్యార్ధులను) గావించాలి
ఆ) బోధనాభ్యసన సామాగ్రి సమకూర్చుకోవాలి.
ఇ) రేడియో పాఠంలో ప్రసారం కాబోయే ఆటను ఆడించే విధానం తెలుసు కోవాలి.
★★★★★★★★★★★★★
✡ *కృత్యాలు:*
*కృత్యముః*
ఈ కార్యక్రమములో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
• A, B అని రెండు గ్రూపులుగా చేయవలెను.
• చార్టును నల్లబల్ల పై అంటించడం
• విద్యార్థులను రేడియో టీచర్ చెప్పే సూచనలు జాగ్రత్తగా వినమనండి. ఏ గ్రూపు వారిని జవాబు చెప్పమంటే ఆ గ్రూపు వారు సమాధానం చెప్పాలి. విద్యార్థులందరు పాల్గొనేటట్లు చూడవలెను. సరియైన సమాధానం చెప్పిన గ్రూపుకు 1 మార్కు కేటాయించవలెను.
• ఈ విధంగా కృత్యము నిర్వహించవలెను. విజేతలను అభినందించండి.
★★★★★★★★★★★★★
*ఆట*
*'చెరువు గట్టు ఆట'*
గట్టు 🔘(చెరువు),
• తరగతిగదిలో మధ్య పెద్దవృత్తం గీయవలెను.
• వృత్తంలోపల 'చెరువు' అని వృత్తం బయట 'గట్టు' అని వ్రాయవలెను.
• విద్యార్ధులను వృత్తం పై నిలబెట్టవలెను.
• రేడియోలో సంగీతం వస్తున్నంత సేపు విద్యార్ధులందరు వృత్తం పై పరుగెడుతుండాలి.
• సంగీతం ఆగిన పిదప రేడియో టీచర్ గీతక్క సూచనలు అనుసరించి 'చెరువు' అంటే వృత్తం లోపలకు, “గట్టు' అంటే బయటకు దూకాలి.
• రేడియో టీచర్ గీతక్క సూచనలను పాటించనివారు ఔటయినట్లు. వారిని ఆట నుండి తప్పించాలి. సూచనలు పాటించి సరిగా ఆడినవారిచే ఆట కొనసాగించవలె. ఇలా రేడియోలో సంగీతం వస్తున్నంత సేపు ఆట ఆడించి, విజేతలను అభినందించండి.
★★★★★★★★★★★★★
✡ *పాఠం పై గేయం :*
• కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టుపై వ్రాసి స్పష్టంగా కనిపించేలా తరగతి గదిలో ప్రదర్శించాలి.
• గేయాన్ని రెండవసారి వచ్చునపుడు  సామూహికంగా చార్టును చూస్తూ పాడించండి.
★★★★★★★★★★★★★
*🎼  పాట*

*🎤 పల్లవి :*
పిల్లల్లారా, పాపల్లారా విషయం చెబుతా వింటారా!
చాలా పనులు చేయడానికి ముఖ్యమైనది నీరేరా!   //పిల్లల్లారా//

*🎻 చరణం 1:*
వంటలు వండాలంటే, మరి బట్టలు ఉతకాలంటే /2/
స్నాన పానాలు చేయాలంటే అవసరమైనది నీరేరా    //పిల్లల్లారా//

*🎻 చరణం 2:*
పంటలు పండాలంటే మరి మంటలు ఆర్పాలంటే /2/
జీవరాశుల మనుగడ కోసం ముఖ్యమైనది నీరేరా   //పిల్లల్లారా//

*🎻 చరణం 3:*
అవసరానికి మించి నీటిని వాడటమే - వద్దు  /2/
భావితరాలకు నీటిని దాయటమే - ముద్దు   //పిల్లల్లారా//
★★★★★★★★
*✡ పాట ప్రసార సమయంలో:*
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.

• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.
"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 05-02-2020
విషయం : తెలుగు
పాఠం పేరు : "శతక పద్యాలు"
తరగతి : 5వ తరగతి
సమయం : 11 AM

నిర్వహణ సమయం : 30 ని.లు

నేటి రేడియో పాఠం : "శతక పద్యాలు-1వ భాగం" (05.02.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, ప్రసార పూర్వ కృత్యాలు, ఆట, పాట...
"విందాం - నేర్చుకుందాం"..
నేటి రేడియో పాఠం
తేదీ : 03-02-2020
విషయం : తెలుగు
పాఠం పేరు : "మాటల ప్రయాణం"
తరగతి : 4వ తరగతి
సమయం : 11 AM
నిర్వహణ సమయం : 30 ని.లు
నేటి రేడియో పాఠం : "మాటల ప్రయాణం" (03.02.2020)... బోధనా లక్ష్యాలు, బోధనాభ్యసనా సామాగ్రి, ప్రసార పూర్వ కృత్యాలు, పాట...

Previous
Next Post »
0 Komentar

Google Tags