2 types of QR codes in textbooks
పాఠ్యపుస్తకాల్లో 2రకాల
క్యూఆర్ కోడ్‌లు
★ వచ్చే విద్యా సంవత్సరం
నుంచి రెండు రకాల క్యూఆర్ కోడ్‌లతో కలిగిన పాఠ్యపుస్తకాలను పాఠశాల విద్యాశాఖ
అందుబాటులోకి తీసుకురానుంది.
★ పాఠ్యాంశం, విద్యార్థి విశ్లేషణ, అంచనాకు ఈ క్యూఆర్ కోడ్‌లను
తీసుకొస్తున్నారు. 1 నుంచి 6వ తరగతి
పాఠ్యపుస్తకాలను మార్పు చేస్తున్న అధికారులు ఈ విధానంలో రూపకల్పన చేస్తున్నారు.
★ ఇప్పటికే పాఠ్యాంశాల్లో
క్యూఆర్ కోడ్ అమరిక పూర్తికాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలను నిక్షిప్తం చేసే
ప్రక్రియ కొనసాగుతోంది.
★ విద్యార్థులకు పాఠం
సులభంగా అర్థమయ్యేలా ఉదాహరణలతో కూడిన వీడియోలకు ఒక క్యూఆర్ కోడ్‌ను.. పాఠం ఎంత
వరకు అర్థమైందో తెలుసుకునేందుకు మరో కోడ్‌ను పుస్తకాల్లో పొందుపరుస్తున్నారు.
★ పాఠ్యాంశ కోడ్‌ను సెల్‌ఫోన్‌తో
స్కానింగ్ చేస్తే వీడియోలు ప్రత్యక్షమవుతాయి. మరో క్యూఆర్ కోడ్‌లో ఆ
పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు, జవాబులు ఇస్తారు.
విద్యార్థి ప్రశ్నలకు జవాబులను గుర్తించడం ద్వారా పాఠం ఎంతవరకు అర్థమైందో విశ్లేషణ
చేయవచ్చు.
0 Komentar