Admissions into 1st year Intermediate course Introduction of e-admissions for the academic year 2020-21
ఇంటర్ లోకి నేరుగా ప్రవేశాలు
చెల్లవు
• వచ్చే ఏడాదికి ఆన్ లైన్
ప్రవేశాలు నిర్వహిస్తాం
• స్పష్టం చేసిన ఇంటర్ బోర్డు
సాక్షి, అమరావతి:
ఇంటర్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరానికి ఆయా యాజమాన్యాలు నేరుగా నిర్వహించే
అడ్మిషన్లు చెల్లవని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇటువంటి కాలేజీలపై చర్యలు
తీసుకుంటామని హెచ్చరించింది. ఇంటర్ కళాశాలలు అక్రమ ప్రవేశాలు నిర్వహిస్తుండటం,
అత్యధిక ఫీజులు వసూలు చేస్తుండటంపై బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ
ప్రకటనలో ఇంకా ఏముందంటే..
*వచ్చే విద్యాసంవత్సరానికి
(2020-21) 'కంప్యూటరైజ్డ్ ఆటోమేటెడ్ స్టూడెంట్ అడ్మిషన్లు'
నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాం.
*ఆన్లైన్ అడ్మిషన్ల
ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో షెడ్యూల్ ద్వారా తెలియజేస్తాం. బోర్డు వెబ్
సైట్లో ఈ షెడ్యూల్ అందుబాటులో ఉంటుంది.
* ఈ నేపథ్యంలో అన్ని ప్రయివేటు, అన్
ఎయిడెడ్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు నేరుగా ప్రవేశాలు చేయరాదు.
* రాష్ట్రంలోని కొన్ని ప్రయివేటు
కార్పొరేట్ కాలేజీలు ఇప్పటి నుంచే విద్యార్థులకు, తల్లిదండ్రులకు
మాయమాటలు చెప్పి అక్రమంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
* టెన్త్ పరీక్షల ఫలితాలు
రాకుండానే ఫస్టియర్ ఇంటర్ లోకి ప్రవేశాలు చేపడుతున్నాయి.
* ఇటువంటి ప్రవేశాలు చెల్లుబాటు
కావు.
0 Komentar