All Passenger Train
services are cancelled
మార్చి 31వ
తేదీ వరకు రైలు సర్వీసులన్నీ బంద్
సంభందిత ఉత్తర్వు కోసం క్రింద చూడండి.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు ప్యాసెంజర్ సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడవనున్నాయని తెలిపింది. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం నుంచే ప్రధాన సర్వీసుల్ని రైల్వే విభాగం రద్దు చేసింది. తాజాగా అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం వాటి గమ్య స్థానాలను చేరే వరకు అనుమతిస్తామని తెలిపింది.
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 వరకూ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయాలని హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది.
0 Komentar