‘నో స్కూల్ బ్యాగ్ డే’
అందరూ పాటించాల్సిందే
★ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను కొన్ని పాఠశాలలు
నిర్లక్ష్యం చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలలు
పట్టించుకోవడం లేదని విద్యా శాఖ దృష్టికి వచ్చింది.
★ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు
కూడా దీన్ని తూతూ మంత్రంగా చేపడుతున్నట్లు గమనించింది. ఈ నేపథ్యంలో అన్ని
యాజమాన్యాల్లోని పాఠశాలల్లోనూ నిర్ణీత పద్ధతిలో ‘నో స్కూల్
బ్యాగ్ డే’ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్
వి.చినవీరభద్రుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
★ ప్రాంతీయ సంయుక్త
సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు. డిప్యూటీ డీఈవోలు,
స్కూల్ కాంప్లెక్స్ బాధ్యులైన హెచ్‌ఎంలు ప్రతి నెల ఒకటి, మూడో శనివారాల్లో తప్పనిసరిగా ఆయా పాఠశాలలను సందర్శించాలని ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.
★ 2 ప్రయివేటు, 1 ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, తమ విజిటింగ్
రిపోర్టును సంబంధిత వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాలని సూచించారు.
★ కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ఈ కార్యక్రమంపై తీసిన వీడియోకు జాతీయ స్థాయిలో
ఇటీవల అవార్డు లభించింది.
0 Komentar