AP Employees One day wage to CM Relief fund
సీఎం రిలీఫ్ ఫండు
ఒక రోజు వేతనం
కరోనా విపత్తును
ఎదుర్కొనేందుకు ఒక రోజు మూల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని
నిర్ణయించినట్టు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇల్లు దాటి బయటకు రాని పేదలకు ప్రభుత్వం రూ.1000 ఇస్తున్న నేపథ్యంలో.. ఉద్యోగులుగా తమ వంతు సహకారం అందించేందుకు ఈ నిర్ణయం
తీసుకున్నట్టు పత్రికా ప్రకటనతో పేర్కొన్నారు. అలాగే పారిశుద్ధ్యం, కరోనా నియంత్రణ విభాగాల్లో పనిచేసే వారికోసం ఒక రోజు వేతనాన్నిస్తున్నట్టు
సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సోమవారం మీడియాకు
వెల్లడించారు.
0 Komentar