Bank working hours changed
బ్యాంకు పనివేళలు
మార్పు
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో
బ్యాంకు పనివేళలను కుదించారు. మార్చి 31 వరకు ఉదయం 10గం. నుంచి మధ్యాహ్నం 2 గం.ల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. భారతబ్యాంకర్ల
సంఘం సూచనల మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సబ్ కమిటీని
ఏర్పాటుచేశారు. ఈ కమిటీ సోమవారం వివిధ బ్యాంకుల అధికారులతో చర్చించింది. లా డౌన్
నేపథ్యంలో రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఈ
సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నగదు ఉపసంహరణ,
డిపాజిట్లు, చెల్లింపులు, ప్రభుత్వలావాదేవీలు తదితర ముఖ్యమైన సేవలకే పరిమితం కావాలని, ఉదయం పదింటినుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనివేళలుగా
నిర్దేశించుకోవాలని కమిటీ సూచించింది. సిబ్బందిని అందుబాటులో ఉంచుకుని 50శాతం మందితో విధులు నిర్వహించేలా బ్యాంకు మేనేజర్లు తగిన నిర్ణయం తీసుకోవాలని
సూచించింది. ప్రభావిత ప్రాంతాల పరిధిలో అన్నీ మూసివేయాల్సి వస్తే, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకులను , మూసివేయవచ్చని
తెలిపింది. బ్యాంకుల ఏటీఎం కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని, ఆన్లైన్ లావాదేవీల దిశగా వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను
వినియోగించుకోవాలని కోరింది.
0 Komentar