Benefits of
APGLI Policy
APGLI పాలసీ వలన కలిగే
ప్రయోజనాలు
ఏపీజీఎల్ఐ పాలసీ
ఉద్యోగి వయస్సును బట్టి, కట్టే ప్రీమియాన్ని ఆనుసరించి రేటు
నిర్ణయిస్తారు. 21 ఏళ్ల నుంచి 53 ఏళ్ల
వరకు (53 ఏళ్లు నిండాక ఏపీజీఎల్ వర్తించదు) వయస్సును బట్టి
మనం కట్టే ప్రీమియానికి బాండ్ విలువ
నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి వయస్సు 22 ఏళ్లు,
అతను కేవలం రూ.4 వేలు మాత్రమే ప్రీమియం
చెల్లిస్తే ఆతను కట్టిన ప్రతి రూపాయికీ 29 ఏళ్ల తర్వాత ప్రభుత్వం
రూ.329.50 ఇస్తుంది. అంటే 4000x329.50
లెక్కిస్తే రూ.13.80 లక్షలు అతని బాండ్ విలువ అవుతుంది. ఆతని
సర్వీసు ఇంకా 29 ఏళ్లుంది అనుకుంటే.. అప్పుడు అతని బాండ్ విలువ
రూ.13.18 లక్షలకు ఏడాదికి 10 శాతం ఆదనపు
బోనస్ వర్తిస్తుంది. అప్పుడు అతని బాండ్ విలువ మొత్తం రూ.38,22,200 అవుతుంది. ఇదంతా ఉద్యోగ విరమణ తర్వాత బోనస్ గా వస్తుంది. బాండ్
విలువ+బోనస్ (13.18లక్షలు+33,22,200)
కలుపుకుంటే రూ.51,40,200 ఉద్యోగ విరమణ సమయంలో వస్తుంది.
ఇది నమ్మగలరా?
ఉద్యోగి ప్రతి
నెలా చెల్లించే రూ.4 వేలు 29 ఏళ్లకు రూ.19.22
లక్షలు మాత్రమే. కానీ 58 ఏళ్ల తరువాత అరకోటికి
పైగా వస్తుంది. ఏ బీమా కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తం ఇవ్వదు. ఇది కేవలం ప్రభుత్వోద్యోగులకు
మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఏపీజీఎల్ పూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి
సంబంధించింది. ఇందులో వచ్చే లాభాలు ఎవరూ పంచుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం కూడా
ఎలాంటి రాబడి ఆశించదు. అందులో వచ్చే ప్రయోజనాలన్నీ ఉద్యోగులకే పంచుతుంది.
వయస్సును బట్టి
బాండ్ విలువ ఇలా...
కట్టే ప్రతి
రూపాయికి ప్రభుత్వం బాండ్ విలువ నిర్ణయిస్తుంది. ఏపీజీఎల్ చందా మీ సామర్యాన్ని
బట్టి ఎంత పెంచాలో నిర్ణయించుకుని ముందుకెళ్తే ఉద్యోగికి మంచిది. వయస్సు పెరిగే కొద్దీ
ప్రభుత్వం ఇచ్చే వెల తగ్గుతుంది. ఏ జీవితా బీమా కంపెనీ అయినా వయస్సును బట్టే పాలసీ
నిర్ణయిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఈ పాలసీ గురించి తెలియడం లేదు.
0 Komentar