CBSE 10th
Class / Inter Exams Postponed
కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు
పరీక్షల మీద కూడా పడింది. సీబీఎస్ఈ (CBSE Exams) పదో తరగతి,
ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు బోర్డు ప్రకటన విడుదల
చేసింది. ఉన్నత విద్యాశాఖ నుంచి వచ్చిన సలహా మేరకు ఈ కింది నిర్ణయాలు
తీసుకుంటున్నట్టు సీబీఎస్ఈ బోర్డు ఓ అత్యవసర ప్రకటనలో పేర్కొంది. మార్చి 19వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ మధ్య భారతదేశంతో పాటు
విదేశాల్లో నిర్వహించాల్సిన పదో తరగతి, 12వ తరగతి పరీక్షలను
వాయిదా వేశారు. మార్చి 31 తర్వాత రీషెడ్యూల్ చేస్తామని
బోర్డు ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తామనే విషయాన్ని మార్చి 31లోపు గానీ, ఆ తర్వాత గానీ ప్రకటిస్తామని తెలిపింది.
అలాగే, ప్రస్తుతం దేశంలోని కొన్ని స్కూళ్లలో జరుగుతున్న
పేపర్లు దిద్దే ప్రక్రియను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
అన్ని కేంద్రాల్లోని నోడల్
ఆఫీసర్లు పేపర్లను జాగ్రత్త చేయాలని, ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకనం (సీబీఎస్ఈ బోర్డు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోతే)
చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే మూల్యాంకనం చేసిన వాటిని జాగ్రత్త చేయాలని
స్పష్టం చేసింది. ఆయా ఆన్సర్ షీట్లకు సీల్ వేసి, సంతకాలు
కూడా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. సీల్ వేయకుండా పంపించిన ఆన్సర్ షీట్ల బ్యాగ్‌లను
తీసుకోబోమని స్పష్టం చేసింది.
0 Komentar