Continue One School for Telugu Medium at Mandal Headquarter
School Education Department – Converting all classes from I to VI in
Primary, Upper Primary, High Schools under all managements into English Medium
from the academic year 2020-21 – Continue One School for
Telugu Medium at Mandal Headquarter and continue all Minor Medium schools in
all managements except un-aided schools in the State - Orders-Issued.
సంభందిత ఉత్తర్వుల కోసం క్రింద చూడగలరు
సంభందిత ఉత్తర్వుల కోసం క్రింద చూడగలరు
మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల
వచ్చే ఏడాది నుంచీ 1-6 తరగతులను
ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూనే మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేస్తూ
ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఈ పాఠశాలను మండల కేంద్రంలో
ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తెలుగు మాధ్యమం కోరుకునే విద్యార్థులకు ఇక్కడ
ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థులు తమ గ్రామం నుంచి మండల కేంద్రంలోని పాఠశాలకు
చేరుకునేందుకు రవాణా ఛార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. మైనర్ మాధ్యమాలైన ఒరియా, కన్నడ,
తమిళ్, ఉర్దూ మాధ్యమాలు కొనసాగనున్నాయి.
వీటికి సంబంధించిన పుస్తకాలు, ఉపాధ్యాయుల కరదీపికను
రూపొందించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలిని ప్రభుత్వం
ఆదేశించింది. అన్ని మాధ్యమాల్లోనూ తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉంటుంది.
0 Komentar