కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సాయం
మానవాళిని మనుగుడకే పెను సవాలుగా
పరిణమించిన కరోనా (కోవిడ్-19) వైరస్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం
నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు కకావికలమవుతున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య
లభ్యతపై పలు చర్యలతో పాటు, ఉపశమన
చర్యల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక
వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని
ప్రకటించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు.
ఉపశమన చర్యలు
*కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7
లక్షల కోట్ల సహాయం
*ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం
కింద సహాయం
*కరోనా కేసుల్లో పని చేస్తున్న
ఆరోగ్య సహాయకులకు 50 లక్షల ఆరోగ్య భీమా
*3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్ యోజన్ ద్వారా
*మరో 5 కేజీల బియ్యం లేదా
గోధుమలుఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం
*వీటితో పాటు కేజీ పప్పు సరఫరా
చేస్తాం
*పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ
*పీఎం కిసాన్ కింద ఇప్పటికే
రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్నాం
*మొదటి విడతగా రూ.2వేలు వెంటనే
రైతుల ఖాతాల్లో జమ
*ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే
రోజువారీ వేతనం రూ.202కు పెంపు
*వితంతువులు, వికలాంగులు,
వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి
*జన్‌ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు
నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు
*ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా
మూడు గ్యాస్ సిలిండర్లు
0 Komentar