Countrywide lockdown for 21
days
దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్
*ఈ రోజు అర్ధ రాత్రి 12
నుంచి ...
కరోనా (కొవిడ్-19) వైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
తీసుకుంది. ఈ రోజు అర్ధ రాత్రి 12 నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్
చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ
లాక్‌డౌన్ 21 రోజులు కొనసాగుతుందని మోదీ తెలిపారు. ఈ సమయంలో
ఇంటి నుంచి బయటకు రావడాన్ని పూర్తిగా నిషేధించారు.
కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని భారత ప్రధాని మోదీ అన్నారు. రానున్న 21 రోజులు చాలా కీలకం అని తెలిపారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘‘కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా మోదటి లక్ష మందికి చేరడానికి 67 రోజులు పట్టింది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లోనే 3 లక్షలకు చేరింది. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే మనచేతుల్లో ఏమి ఉండదు. ప్రజలంతా ఒకే పని చేయాలి. ఇళ్లలోనే ఉండాలి. ఈ లాక్‌డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికీ లక్ష్మణరేఖ వంటిది’’ అని మోదీ తెలిపారు.

0 Komentar