Deadline for filing IT returns extended
ఆధార్-పాన్ అనుసంధానం & ఐటీ రిటర్నుల దాఖలకు గడువుల పెంపు
బ్యాంక్ ఖాతాదారులు అన్ని
ఏటీఎంల్లో నగదు ఉపసంహరించుకోవచ్చని, మూడు నెలలపాటు ఛార్జీలు
ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్యాంకు
ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉంచాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. స్టాక్‌మార్కెట్లలో
చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు, ఆర్థిక అంశాలపై ఆర్‌బీఐ,
ఆర్థిక శాఖ సంయుక్తంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో
దేశమంతా లాక్‌డౌన్ నెలకొన్న నేపథ్యంలో 2018- 19 ఆర్థిక సంవత్సరం
ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
వెల్లడించారు. ఈ గడువును జూన్ 30 2020 వరకు పొడిగించినట్టు
తెలిపారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12
నుంచి 9శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం
మధ్యాహ్నం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. వైరస్ వ్యాప్తిని
అరికట్టడానికే లాక్‌డౌన్ విధించినట్టు చెప్పారు.
ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందన్న ఆమె.. ఆర్థిక
సంవత్సరం చివరు రోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందన్నారు. ఆధార్ పాన్ అనుసంధానం గడువు జూన్ 30
వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. టీడీఎస్ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9శాతానికి తగ్గించడంతో పాటు వివాద్ సే విశ్వాస్ పథకం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపులో 10శాతం అదనపు రుసుం ఉండదన్నారు. మార్చి, ఏప్రిల్,
మే జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు సైతం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు నిర్మలాసీతారామన్ స్పష్టంచేశారు.
0 Komentar