Different CET’s application
deadlines extended
ప్రవేశ పరీక్షల
దరఖాస్తు గడువు పొడిగింపు
ఎంసెట్, ఈసెట్,
ఐసెట్ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగించారు. కరోనా వైరస్
వ్యాప్తి నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయడంతో దరఖాస్తులకు
ఇబ్బందులు ఎదురవుతున్నట్లు విద్యార్థుల నుంచి వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగించినట్లు ఉమ్మడి ప్రవేశ
పరీక్షల ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు.
ఎంసెట్
* చివరి గడువు:
ఏప్రిల్ 5
* రూ.500 అపరాధ
రుసుముతో : ఏప్రిల్ 10
* రూ.1000 అపరాధ
రుసుముతో : ఏప్రిల్ 15
*రూ.5000 అపరాధ రుసుముతో : ఏప్రిల్ 17
*రూ.10,000
అపరాధ రుసుముతో : ఏప్రిల్ 19
ఈసెట్
* దరఖాస్తు
చివరి గడువు : ఏప్రిల్ 9
* రూ.1000
అపరాధ రుసుముతో : ఏప్రిల్ 16
ఐసెట్
* దరఖాస్తు
చివరి గడువు: ఏప్రిల్ 9
* రూ.2000 అపరాధ రుసుముతో: ఏప్రిల్ 16
*రూ.5000 అపరాధ రుసుముతో: ఏప్రిల్ 22
* రూ.10,000
అపరాధ రుసుముతో: ఏప్రిల్ 25
0 Komentar