Duties and Responsibilities of PO’s
ప్రిసైడింగ్ అధికారుల విధులు,
బాధ్యతలు
- పోలింగ్ స్టేషన్ లో
పోలింగ్ సక్రమ నిర్వహణ కోసం ప్రిసైడింగ్ అధికారి (పి.ఓ) పూర్తి బాధ్యత వహిస్తారు.
- జెడ్.పి.టి.సి/ఎం.పి.టి.సి
యొక్క ఎన్నికల నిర్వహణ బాధ్యత వహించే రిటర్నింగ్ అధికారి మార్గదర్శకంలో
ప్రిసైడింగ్ అధికారి పని చేయాలి.
- ప్రిసైడింగ్ అధికారితో
పాటు, బృందంలో ఇతర పోలింగ్ అధికారులు ఉంటారు. పోలింగ్ అధికారులలో
ఒకరిని సహాయ ప్రిసైడింగ్ అధికారి (APO)గా నియమించడం జరుగుతుంది.
- ప్రిసైడింగ్ అధికారి
నియామక ఉత్తర్వులో సూచించిన తేదీ, శిక్షణా స్థలం ప్రకారం
ప్రిసైడింగ్ అధికారి మరియ సహాయక ప్రిసైడింగ్ అధికారికి మాత్రమే రిటర్నింగ్ అధికారి
ఆధ్వర్యంలో సవివరంగా శిక్షణ ఇవ్వడమవుతుంది.
- ఎన్నికలకు ఒక రోజు
ముందుగా బృందంలోని ఇతర పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వడం ప్రిసైడింగ్ అధికారి
బాధ్యత.
- ప్రిసైడింగ్ అధికారి,
ఎన్నికల నిర్వహణలో ఒక ముఖ్యమైన పాత్రను నిర్వహించాల్సి ఉంటుంది.
పోలింగ్ స్టేషన్లో కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రిసైడింగ్ అధికారి పూర్తి అధికారాలు
కల్గి ఉంటారు.
- పోలింగ్ స్టేషన్లో
స్వేచ్చాయుతమైన, నిష్పక్షపాతమైన పోలింగ్ జరిగేలా చూడటం
ప్రిసైడింగ్ అధికారి ప్రాధమిక విధి, బాధ్యత.
- పోలింగ్ నిర్వహణకు
సంబంధించి చట్టం, కార్య విధానం, ఎన్నికల
సంఘం ఆదేశాలు, సూచనలతో ప్రిసైడింగ్ అధికారి సమాయత్తం అయి
ఉంటే, వాటి అనుగుణంగా ఎన్నికలను ఖచ్చితంగా నిష్పక్షపాతంగా
వ్యవహరించడానికి వీలు కలుగుతుంది.
Duties and Responsibilities of PO’s (Type-I)
DOWNLOAD
Duties and Responsibilities of PO’s (Type-II)
DOWNLOAD
Duties and Responsibilities of PO’s (Type-I)
DOWNLOAD
Duties and Responsibilities of PO’s (Type-II)
DOWNLOAD
0 Komentar