Effective home remedies
for Lice
తలలో పేలు మానవుల
తల మీద పెరిగుతూ తలలో రక్తాన్ని పీల్చే చిన్న పరాన్న జీవులు. ఇవి ఇంచుమించు అన్ని జంతువులు
మరియు పక్షుల శరీరం మీద బాహ్య పరాన్న జీవులు. స్త్రీ కీటకాలు 80-100 అండాలు విడుదల చేస్తూ వాటిని వెంట్రుకలకు గట్టిగా అంటి పెట్టుకొనేట్టు
చేస్తాయి. అండాలు తెల్లగా ఉంటాయి. అండాల నుంచి నేరుగా వారం రోజుల్లో పిల్లపేలు
పుడతాయి.
ఇవి దువ్వెనల
ద్వారా గానీ, ఇతర వస్తువుల ద్వారా, మనం ధరించే
దుస్తుల ద్వారా వ్యాపిస్తాయి. పేలు పిల్లలలో చాలా సాధారణంగా కనిపిస్తాయి. పాఠశాలల్లో
లేదా ఆటల సమయంలో వారు ఇతర పిల్లలతో ఎక్కువగా కలుస్తూ ఉండడం వలన తలలో పేలు వృద్ది
చెందుతాయి. మెడికర్ అను షాంపూ పేలు నివారణకు వాడతారు.
తలలో పేలు నివారణ
ఉప్పు
అరకప్పు వెనిగర్
లో ఐదు స్పూన్స్ ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. రెండు
గంటలు అయ్యాక మీ జుట్టు కడగడం మరియు దువ్వటం చేయాలి.
వెన్న
రాత్రి పడుకోనే
సమయంలో వెన్నను తలకు పట్టించి, మరుసటి రోజు ఉదయం షాంపూ తో కడగటం
మరియు దువ్వెనతో దువ్వాలి.
డెట్టాల్
తల మీద చర్మంపై
డెట్టాల్ పట్టించి, ఒక గంట తర్వాత ఆలివ్ ఆయిల్ రాయాలి. రాత్రి
పూట అలా వదిలేసి, ఉదయం షాంపూ తో మీ జుట్టును కడగటం మరియు
దువ్వెనతో దువ్వాలి.
వెల్లుల్లి
వెల్లుల్లిని
మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ గా చేసి దానికి నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని
జుట్టుకు పట్టించి ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి. ఆ
తర్వాత దువ్వెనతో దువ్వాలి.
వైట్ వెనిగర్
రాత్రి
పడుకోవటానికి ముందు కొంచెం వైట్ వెనిగర్ తీసుకోని తలకు పట్టించాలి. రాత్రి అలా
వదిలేసి ఉదయం షాంపూ తో మీ జుట్టును కడిగి మరియు దువ్వెనతో దువ్వితే పేలు బయటకు
వస్తాయి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను ఆలివ్
నూనెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెత్తిమీద చర్మంపై రాసి రాత్రిపూట వదిలి
వేయాలి. ఉదయం, షాంపూ తో కడగడం మరియు దువ్వెనతో దువ్వాలి.
ఆలివ్ నూనె
మూడు వారాల పాటు
ప్రతి ఉదయం మరియు సాయంత్రం మీ జుట్టుకు ఆలివ్ నూనె లేదా బాదం నూనె రాసి దువ్వండి.
ఆపిల్ సైడర్
వెనిగర్ మరియు కొబ్బరి నూనె
ఆపిల్ సైడర్ వెనిగర్
మరియు కొబ్బరి నూనె కలపి, రాత్రి పడుకోనే సమయంలో ఈ మిశ్రమాన్ని పట్టించి అలా
వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ తో కడగడం మరియు దువ్వెనతో దువ్వాలి.
పెట్రోలియం
జెల్లీ
రాత్రి పడుకొనే
ముందు పెట్రోలియం జెల్లీ రాసి రాత్రి అలా వదిలేసి, తెల్లారి ఉదయం
పెట్రోలియం జెల్లీ తొలగించడానికి బేబీ ఆయిల్ ను ఉపయోగించండి. పేలను పూర్తిగా
తొలగించటానికి దువ్వండి.
హైడ్రోజన్
పెరాక్సైడ్ మరియు బోరాక్స్
నీటితో
హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కలపండి. దానిలో బోరాక్స్ కలిపి హైడ్రోజన్ పెరాక్సైడ్
లో బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలపై చర్మం మీద బాగా రుద్దాలి. ఉదయం, షాంపూ
తో కడగడం మరియు దువ్వెనతో దువ్వాలి.
సీతాఫలము గింజలు
సీతాఫలములోని
గింజలను తీసుకొని, వాటిని బాగా అరగదీసి, దానిని తలకు పూసుకొనవలెను. 3,4 గంటల తర్వాత, తలస్నానము
చేయవలెను. ఇట్లు ఒక వారం రోజులు చేసిన, తలలోని పేలు పూర్తిగా
పోవును.
కాకుమాని గింజలు
కాకుమాని గింజలు పొడి
చేసి, నూనెలో
వేసి, ఆ నూనెను 2 రోజులు మంచి ఎండలో ఉంచి, తదుపరి, తలకు మర్ధనా చేయవలెను. ఇట్లు పది రోజులు
చేసిన పేలు పోవును
0 Komentar