Home remedies for reducing hair fall
హెయిర్ ఫాల్ తగ్గించేందుకు గృహ
నివారణ పద్ధతులు
హెయిర్ ఫాల్ సమస్యకు ఎన్నో వైద్య
చికిత్సలు ఉన్నప్పటికీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను
తొలగించేందుకు ఉత్తమ మార్గం ఇంటి నివారణ పద్దతులను అనుసరించటం. కొన్ని సులభమైన
మరియు ప్రభావితమైన హోమ్ రెమెడీలను చూద్దాం.
ఆమ్ల
కొబ్బరి నూనెలో లేదా బాదాం నూనెలో
కొన్ని ఆమ్లా ముక్కలను వేసి వేడి చేసి రెండు మూడు నిమిషాల తరువాత వెచ్చని నూనెని
మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒకటి లేదా రెండు గంటలు ఉంచి తల స్నానం చేయాలి. ఆమ్లా
జ్యూస్ మరియు నిమ్మరసంను కలిపి షాంపూలాగా ఉపయోగించవచ్చు.
రెండు టేబుల్ స్పూన్ యూకలిప్టస్
నూనెలో ఆమ్లా ముక్కలను రాత్రంతా నానబెట్టండి. ఒక మందపాటి పేస్ట్ సిద్ధం చేయడానికి
గుడ్డు మరియు పెరుగును ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఈ పేస్ట్ ని మీ స్కాల్ప్ మరియు
జుట్టుపై పూర్తిగా అప్లై చేసి ఆరిపోయే వరకు వదిలివేయండి. ఆ తరువాత షాంపూతో కడగాలి.
ఆవాల నూనె
ఆవాల నూనె మరియు హెన్నా ఆకులను
కలిపి ఉడికించిన మిశ్రమం హెయిర్ ఫాల్ ని ఆపడానికి ఉపయోగపడుతుంది. 125 మి.లి ఆవాల నూనె మరియు 30 గ్రాముల గోరింటాకులను
కలిపి బాగా వేడి చేయండి. చల్లారిన తరువాత నూనెని వడకట్టి ఒక కంటైనర్లో స్టోర్
చేసుకోండి. ఈ నూనెతో రెగ్యులర్గా మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, అంతే కాదు మీ కురులు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
కలబంద
కలబంద హెయిర్ ఫాల్ ని తగ్గించి
డాండ్రఫ్ ని తొలగిస్తుంది. మీ స్కాల్ప్ లో PH లెవెల్స్ ని కూడా
రీస్టోర్ చేస్తుంది. కలబంద జెల్ ని డైరెక్ట్ గా మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి
ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు ఉపయోగించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
కొబ్బరి పాలు
కొబ్బరి ముక్కలను బాగా రుబ్బి వాటి
నుండి పాలను తీసి, మీ స్కాల్ప్ మీద మరియు వెంట్రుకల మూలకాల పై అప్లై చేసి ఐదు
నుండి పది నిమిషాలు మసాజ్ చేయండి. ఇది కేశాలకు పోషణ అందించి ఆరోగ్యకరమైన
పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నిమ్మరసంతో కలిపిన కొబ్బరి నూనెని స్కాల్ప్ మరియు
కురులపై రాయటం వలన హెయిర్ ఫాల్ తగ్గి కురులు పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది.
కొత్తిమీర ఆకులు
కొత్తిమీర ఆకులను రుబ్బి వీటి
రసాన్ని రెగ్యులర్ గా స్కాల్ప్ పై రాయటం వలన హెయిర్ ఫాల్ తగ్గి మీ కేశాలు ఒత్తుగా
పెరుగుతాయి. వారానికి మూడు సార్లు ఈ రసాన్ని ఉపయోగించవచ్చు.
ఆయిల్ మసాజ్
సాధారణ కొబ్బరి నూనె, బాదం
నూనె, ఆవాలు నూనె, లావెండర్ నూనె,
రోజ్మేరీ వంటి అనేక చమురులు ఉన్నాయి. మీ జుట్టుని ప్రతి రోజూ వీటిలో
ఏదో ఒక నూనెతో మసాజ్ చేయండి. ఇది మీ కురులకు సంబంధించిన అనేక సమస్యలను ఖచ్చితంగా
పరిష్కరిస్తుంది.
జీలకర్ర
విత్తనాలు
జీలకర్ర పేస్ట్ తయారు చేయడానికి
కొన్ని గింజలను రుబ్బి అందులో కొబ్బరి నూనెని కలపి ఒక పేస్ట్ ను తయారు చేసుకోండి.
దానితో చక్కగా మీ స్కాల్ప్ పై మసాజ్ చేసుకోండి. సుమారు 15
నిమిషాల తరువాత, షాంపూతో తలస్నానం చేయండి.
ఎగ్ వైట్
గుడ్డు ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలం.
ఇది మీ జుట్టు యొక్క కోల్పోయిన షైన్ ని తిరిగి తెస్తుంది. పొడవాటి, బలమైన,
ఆరోగ్యకరమైన జుట్టు కోసం, మీ కురులపై గుడ్డు
యొక్క తెల్ల సొనను పూసి కొద్ది సేపు తరువాత తల స్నానం చేయండి. వారానికి ఒకసారి ఈ
ప్రక్రియను అనుసరించండి.
వేపాకు
వేపాకు లోని యాంటీ బ్యాక్టీరియా, యాంటీ
ఫంగల్ మరియు క్రిమినాశక లక్షణాలు మీ జుట్టులో స్ప్లిట్‌స్ ఏర్పడకుండా చేస్తుంది
మరియు మీ స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని తాజా వేప ఆకులను నీటిలో వేసి నీరు
సగానికి సగం ఇంకిపోయే వరకు ఉడికించండి. ఈ నీటిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని
మంచి ఫలితాల కోసం ప్రతి రోజూ మీ స్కాల్ప్ పై అప్లై చేయండి.
హెన్నా
హెన్నా యొక్క లక్షణాల గురించి
అందరికీ తెలిసిందే. హెయిర్ ఫాల్, స్ప్లిట్ ఎండ్స్, డ్రైనెస్ వంటి అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ ని తొలగించటంలో సహాయపడుతుంది.
హెన్నా పేస్ట్ ని ప్రతి వారం వాడవచ్చు. మీరు తాజా హెన్నా పేస్ట్ తో 2 టేబుల్ స్పూన్లు ఆమ్ల రసంను మరియు కొద్దిగా నీరు జోడించి అద్భుతమైన
హెయిర్ ప్యాక్‌ని తయారుచేయవచ్చు. ఒక బ్రష్‌ను ఉపయోగించి మీ జుట్టు మరియు స్కాల్ప్ పై
ఈ పేస్ట్ ని అప్లై చేయండి. సుమారు ఒక గంట అలాగే ఉంచి షాంపూతో కడగాలి.
పెరుగు
పెరుగు జుట్టు రాలడాన్ని ఆపడం
మాత్రమే కాదు మీ కేశాలను సిల్కీ, మెరిసే, మృదువైనవిగా
కూడా చేస్తుంది. కర్డ్ ప్యాక్ తయారు చేయడానికి, పెరుగుని
కొద్దిగా ఆవాల పేస్ట్ తో కలపండి. పెరుగును హెన్నా ప్యాక్లలో కూడా ఉపయోగిస్తారు. ఉపయోగించిన
తర్వాత ఒక షాంపూతో తల స్నానం చేయటం మర్చిపోకండి.
షికాకై
షికాకై లో ఎటువంటి కెమికల్స్ ఉండవు
పైగా కురులకు కావాలసిన అన్ని పోషకాలను అందిస్తుంది. దీని వలన మీ జుట్టు మందంగా
పెరుగుతుంది. కనుక కెమికల్స్ తో కూడిన షాంపూలకు బదులుగా షికకైని ఉపయోగించటానికి
ప్రయత్నించండి.
ఉల్లిపాయ రసం
మనలో చాలా మందికి ఇప్పటికీ
ఉల్లిపాయ యొక్క ప్రయోజనాల గురించి తెలియదు. ఉల్లిపాయ నుండి రసంను తీసి, మీ
జుట్టు మీద అప్లై చేసుకోవచ్చు. రాసిన 30 నిమిషాల తరువాత తల
స్నానం చేయండి. ఇది మీ జుట్టు, స్కాల్ప్ మరియు జుట్టు
వేర్లపై కూడా రాయండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి వెంట్రుకల పెరుగుదలకు
సహాయపడుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను
ఇస్తుందని అందరికీ తెలుసు. అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి గ్రీన్ టీ ని మీ
జుట్టు మీద అప్లై చేసుకోవచ్చు. ఈ మూలికా టీ జుట్టు యొక్క పెరుగుదలను
ప్రోత్సహించడానికి ఉత్తమమైన పదార్ధాలను కలిగి ఉంటుంది. మీరు గ్రీన్ టీ ఉపయోగించి
జుట్టుని కడగవచ్చు లేదా ఈ టీ ని మీ జుట్టుకు మాస్క్ లాగా వాడవచ్చు.
ఆమ్లా, కలబంద,
వేప
ఈ పదార్థాలు మీ హెయిర్ ఫాల్ ని
తగ్గించడం మాత్రమే కాదు చుండ్రులను కూడా తొలగిస్తుంది. స్కాల్ప్ పై చికాకు మరియు
దురదను కూడా తగ్గిస్తుంది. అన్ని పదార్ధాలనూ సమాన భాగాలుగా తీసుకొని బాగా
రుబ్బుకోవాలి. ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తలపై రాసి ఒక గంట సేపు తరువాత తల
స్నానం చేయండి.
మెంతులు
మెంతులలో నికోటినిక్ ఆమ్లం మరియు
జుట్టు పెరుగుదలకు కావలసిన ప్రోటీన్లు ఉంటాయి. మీ వెంట్రుకలను మృదువుగా చేయడానికి
రాత్రిపూట విత్తనాలను నీటిలో నానబెట్టి ఉదయం పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని మీ జుట్టు
మీద రాసి ఒక గంటసేపు తర్వాత నీటితో కడగండి. సమర్ధమైన ఫలితాలకు వారానికి
రెండుసార్లు ఉపయోగించండి.
మందార ఆకులు
మరియు పువ్వులు
హైబ్బిస్కస్ ఆకులు హెయిర్ ఫాల్ ని
నివారించడానికి మరియు జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. ఇది స్ప్లిట్ ఎండ్స్ మరియు
చుండ్రుని కూడా నివారిస్తుంది. కొంచం కొబ్బరి నూనెలో 12-15 మందార పువ్వులను వేసి బాగా వేడి చేయండి. చల్లారిన తరువాత ఈ నూనెని
వడకట్టి రాత్రి పడుకునే ముందు తలపై రాసి
ఉదయం కడగాలి. మందార ఆకులను రుబ్బి తల స్నానం చేసే ఒక గంట ముందు స్కాల్ప్ మరియు
కురులపై రాయండి.
0 Komentar