Huge cuts in
salaries of Telangana employees and public representatives
తెలంగాణ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల
జీతాల్లో భారీగా కోత
తెలంగాణ రాష్ట్ర
ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతోందని.. ఈ
నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో
వ్యవహరించాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లాక్‌డౌన్
నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధుల జీతాల్లో భారీగా కోత
విధించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్
వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతోందని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం
ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉందని కేసీఆర్
అన్నారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు,
ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు తెలిపారు.
సోమవారం రాష్ట్ర
ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన పిదప వివిధ రకాల వేతనాల చెల్లింపులపై
నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.
జీతాల్లో కోత..
ఎవరెవరికి ఎంతెంత..?
* ముఖ్యమంత్రి, రాష్ర్ట
మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,
రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక
సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు.
* ఐఎఎస్, ఐపిఎస్,
ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత.
* మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50
శాతం కోత విధిస్తారు.
* నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్,
కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత
విధిస్తారు.
* అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50
శాతం కోత.
* నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10
శాతం కోత.
* అన్ని ప్రభుత్వ
రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత
విధిస్తారు.
DOWNLOAD
COVID-19 – The
Epidemic Diseases Act, 1897- LOCKDOWN – Economic
Slowdown –
Certain austerity measures – Orders - Issued.
G.O.Ms.No. 27 Dated: 30-03-2020DOWNLOAD
0 Komentar