ICAI CA May 2020
Exams Postponed
‘సీఏ’ పరీక్షలు
వాయిదా
మేలో జరగాల్సిన
పరీక్షలను జూన్, జూలైకి రీ-షెడ్యూల్
కరోనా వైరస్
కారణంగా దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో మేలో జరగాల్సిన సీఏ కోర్సులకు సంబంధించిన
వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి. మే 2వ తేదీ నుంచి 18 వరకూ జరగాల్సిన పరీక్షలను రీ-షెడ్యూల్ చేస్తున్నట్టు న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్
ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) శుక్రవారం ప్రకటించింది.
న్యూఢిల్లీలోని
ఐసీఏఐ ప్రకటించిన రీ-షెడ్యూల్ తేదీలు...
*
జూన్ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో సీఏ
(ఫౌండేషన్ కోర్సులో పాత విధానం ప్రకారం పరీక్షలు జరగనున్నాయి.
*ఇంటర్మీడియెట్
(ఐపీసీ) కోర్సు పాత విధానాన్ని అనుసరించి గ్రూప్-1 విభాగంలో
జూన్ 20, 22, 24, 26వ తేదీల్లోనూ, గ్రూప్-2 విభాగంలో జూన్ 28, 30, జూలై 2వ
తేదీల్లో జరగనున్నాయి.
*కొత్త
విధానాన్ని అనుసరించి గ్రూప్-1 విభాగంలో జూన్ 20, 22,
24, 26వ తేదీలు, గ్రూప్-2 విభాగంలో జూన్ 28, 30, జూలై 2వ,
4వ తేదీ ల్లో జరగనున్నాయి.
*సీఏ-ఫైనల్
కోర్సు పరీక్షలు పాత విధానం.. గ్రూప్-1 విభాగంలో జూన్ 19,
21, 23, 25వ తేదీల్లోనూ, గ్రూప్-2 విభాగంలో జూన్ 27, 30, జూలై 2వ,
4వ తేదీల్లో జరగనున్నాయి.
*
సీఏ-ఫైనల్ కొత్త విధానంలో పరీక్షలు గ్రూప్-1 విభాగంలో జూన్ 19,
21, 23, 25 తేదీల్లో, గ్రూప్-2 విభాగ పరీక్షలు జూన్ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో జరగనున్నాయి.
*
ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పార్ట్-1 పరీక్షలు గ్రూప్-ఏ విభాగంలో జూన్ 20, 22, గ్రూప్-బి
విభాగంలో జూన్ 24, 26వ తేదీల్లో జరగనున్నాయి.
*
ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ - అసెస్మెంట్ టెస్ట్ పరీక్ష జూన్ 27, 29వ తేదీల్లో జరుగుతాయి. దేశ వ్యాప్తంగా 207 ప్రధాన
నగరాలు, పట్టణాల్లో జరగనున్న సీఏ పరీక్ష లకు దాదాపు నాలుగు
లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు.
Official website CLICK HERE
0 Komentar