Implemention of Jagananna gorumudda
Until April
ఏప్రిల్ నెలకూ ‘జగనన్న
గోరుముద్ద’
లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలకు
సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని వారి ఇళ్లకే పంపే ఏర్పాట్లు
చేసింది. మొదటి దశలో మార్చి 19 నుంచి 31 వరకూ తొమ్మిది పని దినాలకుగాను 37 లక్షల మంది
విద్యార్థులకు బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని
అందజేసింది. ఇప్పుడు రెండో దశ కార్యక్రమాన్ని
అమలు పర్చేందుకు నిర్ణయించింది.
* ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 14
వరకూ 9 రోజుల పాటు పాఠశాలల పనిదినాలను లెక్కించి ఆ మేరకు విద్యార్థులకు సరుకుల
పంపిణీకి శనివారం ఉత్తర్వులిచ్చింది.
* ఒక వేళ ఏప్రిల్ 14
తర్వాత పాఠశాలలను తెరవకుంటే
విద్యాసంవత్సరం చివరి రోజైన 23 వరకూ పరిగణనలోకి తీసుకుని
మొత్తం 17 రోజులకు సరుకులు సరఫరా.
*రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని
ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభిస్తామన్నారు.
* ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు
కేజీ 700 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత
పాఠశాలల విద్యార్థులకు 2 కేజీల 550
గ్రాముల చొప్పున బియ్యం అందిస్తారు.
* ఒక్కో విద్యార్థికి తొమ్మిది
చిక్కీలు,
17 చొప్పున కోడిగుడ్లు ఇస్తారు.
* గ్రామ, వార్డు
వలంటీర్లు, సిబ్బంది ద్వారా విద్యార్థులకు పంపిణీ
చేయనున్నారు.
* పంపిణీ సమయంలో సామాజిక దూరం
పాటించాలని ఎంఈవోలు, హెచ్‌ఎంలకు, వలంటీర్లకు
సూచన.
Excellent work
ReplyDelete