Jagananna Vidya kanuka
6 వస్తువులతో
జగనన్న విద్యా కానుక: ప్రతి విద్యార్థికీ 3 జతల యూనిఫామ్ క్లాత్, షూ– 2
జతల సాక్స్, బ్యాగ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు.. స్కూళ్లు తెరిచే
నాటికి సిద్ధం చేయాలి అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశం.
ప్రభుత్వ
పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద
ఆరు రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇవన్నీ
నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు చదివే 42 లక్షల మందికి పైగా
విద్యార్థులకు ఈ కిట్లను అందిస్తారు. ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్
క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్య
పుస్తకాలు, షూ– 2 జతల సాక్స్‌లు,
స్కూల్ బ్యాగ్, బెల్టు ఉంటాయి. యూనిఫామ్
కుట్టించేందుకు అయ్యే ఖర్చులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ
చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ
చేయడానికి సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా
శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాఠశాల విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ
సందర్భంగా అధికారులు విద్యార్థులకు అందించే కిట్లలోని వస్తువులను ముఖ్యమంత్రికి
చూపించారు. వాటిని పరిశీలించిన సీఎం కిట్‌లో వస్తువులు పూర్తి నాణ్యతతో ఉండాలని
స్పష్టం చేశారు. పిల్లలు ఏడాది పాటు వినియోగించే వస్తువులు కనుక నాణ్యత విషయంలో
రాజీపడొద్దని ఆదేశించారు.
0 Komentar