JOIN INDIAN
COAST GUARD (MINISTRY OF DEFENCE)
EXCELLENT
OPPORTUNITY FOR DIPLOMA HOLDERS TO JOIN AS YANTRIK 02/2020 BATCH,
(COURSE
COMMENCING IN AUGUST 2020)
ఇండియన్ కోస్ట్‌గార్డ్
లో ఉద్యోగాలు
భారత రక్షణ
మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్, సాయుధ విభాగంలో ‘యాంత్రిక్’ (02/2020 బ్యాచ్) నియామకాలకు నోటిఫికేషన్
విడుదల చేసింది. యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పురుష అభ్యర్థులు
మాత్రమే అర్హులు. ఎంపికైన వారికి ఆగస్టులో శిక్షణ ప్రారంభమవుతుంది.
పోస్టుల వివరాలు
*యాంత్రిక్ 02/2020 బ్యాచ్‌లో 37 ఖాళీలు ప్రకటించారు. ఇందులో యాంత్రిక్
టెక్నికల్(మెకానికల్) పోస్టులు 19 ఉండగా.. వీటిలో జనరల్
కేటగిరీ-8, ఓబీసీ-06, ఎస్సీ-2, ఎస్టీ-2, ఆర్థికంగా వెనుకబడిన వారికి(ఈడబ్ల్యూఎస్)-01 రిజర్వ్ చేశారు.
*యాంత్రిక్
టెక్నికల్(ఎలక్ట్రికల్) విభాగంలో 03 ఖాళీలు ఉండగా.. వీటిలో
జనరల్-01, ఓబీసీ-01, ఎస్సీ-01 కేటాయించారు.
*యాంత్రిక్
టెక్నికల్(ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్) విభాగంలో 15
ఖాళీలు ఉన్నాయి. వీటిలో జనరల్-07, ఓబీసీ-04, ఎస్సీ-03, ఈడబ్ల్యూఎస్-01
రిజర్వ్ చేశారు. పోస్టుల సంఖ్య
ఇంకా పెరిగే అవకాశం ఉంది.
విద్యార్హతలు
పురుష అభ్యర్థులై
ఉండాలి. మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన
విద్యార్హతతో పాటు ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గుర్తింపు
ఉన్న కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్
టెలికమ్యూనికేషన్(రేడియో /పవర్) ఇంజనీరింగ్ 60శాతం మార్కులతో
ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు, జాతీయ స్థాయి
అత్యుత్తమ క్రీడాకారులకు 5 శాతం మార్కుల సడలింపు లభిస్తుంది.
వయస్సు
కనిష్టంగా 18
ఏళ్లు, గరిష్టంగా 22ఏళ్లు ఉండాలి.
అంటే.. 01 ఆగస్టు 1998 నుంచి 31 జూలై 2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో సడలింపు ఉంటుంది.
శారీరక కొలతలు
అభ్యర్థి కనిష్ట
ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. కొండ, గిరిజన ప్రాంత
అభ్యర్థులకు కొంత సడలింపు ఉంటుంది. ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతీ కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి. వయసు, ఎత్తుకు తగిన బరువు
తప్పనిసరి. వినికిడి సమస్య ఉన్నవారికి అవకాశం లేదు. గుర్తింపు లేని కళాశాలల్లో
చదివినవారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు. అభ్యర్థుల శరీరంపై ఎలాంటి పచ్చబొట్టు
(టాటూస్) ఉన్నా తిరస్కరిస్తారు.
ఎంపిక విధానం
యాంత్రిక్
పోస్టులకు రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో దరఖాస్తు
చేసుకున్న పోస్టును బట్టి.. సంబంధిత విభాగంపై
(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్) ప్రశ్నలు ఉంటాయి.
దాంతోపాటు జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఆప్టిట్యూడ్,
ఇంగ్లీష్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షలో అర్హత సాధించిన
వారిని ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), వైద్య పరీక్షకు
ఎంపిక చేస్తారు. మెడికల్ టెస్ట్‌ను ఆర్మీ వైద్యులే నిర్వహిస్తారు.
ఫిజికల్ ఫిట్‌నెస్
టెస్ట్:
7
నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగుతో పాటు.. 20 స్క్వాట్ అప్స్ (ఉతక్ బైతక్), 10 పుష్ అప్స్ పూర్తి
చేయాలి.
జీతభత్యాలు
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో
చేరిన తర్వాత బేసిక్ పే రూ.29,200 (పే లెవల్-5) లభిస్తుంది. దీంతోపాటు అదనంగా యాంత్రిక్ పే రూ.6200, ఇతర అలవెన్సులు ఉంటాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం-విధుల స్వభావం, పోస్టింగ్ పొందే ప్రాంతాన్నిబట్టి ఇతర భత్యాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
పదోన్నతులు-
సౌకర్యాలు
*యాంత్రిక్‌గా
చేరిన అభ్యర్థి ప్రధాన్ సహాయక్ ఇంజనీర్ ర్యాంక్ వరకు పదోన్నతి పొందవచ్చు. ఈ
ర్యాంక్‌లో రూ.47,600 వేతనం, యాంత్రిక్ పే రూ.6200,
డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. తర్వాత పనితీరు ఆధారంగా ఆఫీసర్
కేడర్‌కు పదోన్నతి లభిస్తుంది.
*ఉద్యోగి కుటుంబం, తల్లిదండ్రులకు
ఉచిత రేషన్, వైద్య సౌకర్యాలు, అతి
తక్కువ అద్దెతో ప్రభుత్వ వసతి, ఏటా 45
ఆర్జిత సెలవులు, 08 సాధారణ సెలవులు ఉంటాయి. ఎల్‌టీసీ సదుపాయం
కూడా లభిస్తుంది. ఉద్యోగ విరమణ అనంతరం గ్రాట్యుటీ, కాంట్రిబ్యూటరీ
పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం
*ఆసక్తి గల
అభ్యర్థులు www.joinindiancoastguard.gov.inలో దరఖాస్తు చేయాలి.
*అభ్యర్థి పేరు, తండ్రి/తల్లి
పేరు, పుట్టిన తేదీ(10వ తరగతి
సర్టిఫికెట్ ప్రకారం) ఉండాలి.
*డిప్లొమా మార్కుల
పర్సంటేజీని ‘కచ్చితంగా’ పేర్కొనాలి.
*వ్యక్తిగత
ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని తప్పనిసరిగా
పొందుపరచాలి.
*అభ్యర్థి పరీక్ష
రాసేందుకు వెబ్‌సైట్‌లో చూపించిన ఏదైనా ఒక కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు
*ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభం: 16.03. 2020
*దరఖాస్తుకు
చివరి తేది: 22.03.2020
Detailed Notification DOWNLOADFor official website CLICK HERE
0 Komentar